Buggana-Payyavula: మద్యంపై వచ్చే పన్నులతో అప్పులు కడుతున్నాం.. పయ్యావులకు మంత్రి బుగ్గన కౌంటర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై టిడిపి నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. TDP సీనియర్ నాయకుడు, PAC చైర్మన్ పయ్యావుల కేశవ్ చేస్తున్న...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై టిడిపి నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. TDP సీనియర్ నాయకుడు, PAC చైర్మన్ పయ్యావుల కేశవ్ చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అభిప్రాయపడ్డారు. ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చేసిన అప్పు గుట్టుగా చేయలేదని వివరణ ఇచ్చారు. పీఏసీ చైర్మన్ ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నట్లు ఉందన్నారు.
ప్రజలను అయోమయానికి గురిచెయవద్దని కోరారు. అమ్మఒడి,ఆసరా, చేయూత పథకాల కోసమే అప్పు తీసుకున్నామని అన్నారు. జీవోల ప్రకారమే లోన్ తీసుకున్నామన్నారు. గుట్టుగా ఏమి తీసుకోలేదని అన్నారు. మద్యంపై వచ్చే పన్నును అప్పులు కట్టడానికి కేటాయించడం జరిగిందని తెలిపారు. మద్యంపై వస్తున్న పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలను చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు.
అప్పు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని వివరించారు. TDP హయాంలో వేల కోట్లు అప్పులు చేశారని.. అనుమతులు తీసుకున్నారా అంటూ ప్రశ్నించారు. TDP ప్రభుత్వం 96 వేల కోట్ల నుంచి 2 లక్షల కోట్ల వరకు అప్పులు చేసిందని…వారు చేసిన అప్పులను తాము కడుతున్నామన్నారు.