Padi Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఫ్యూచర్‌పై కొత్త ట్విస్ట్.. హుజూరాబాద్‌ టికెట్ దక్కకపోతే..

Kaushik Reddy: కారులో ప్రయాణం మొదలుపెట్టిన కౌశిక్‌రెడ్డి ఫ్యూచర్‌ ఏంటి? తాను ప్రయాణిస్తున్న కారు ఎంతవరకు తీసుకుపోతుంది..? హుజూరాబాద్‌ బైపోల్‌లో ప్లేయర్‌గా ఉంటారా? లేరా? స్వయంగా CM KCR కండువా...

Padi Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఫ్యూచర్‌పై కొత్త ట్విస్ట్.. హుజూరాబాద్‌ టికెట్ దక్కకపోతే..
Kaushik Reddy
Follow us

|

Updated on: Jul 22, 2021 | 6:53 PM

కారులో ప్రయాణం మొదలుపెట్టిన కౌశిక్‌రెడ్డి ఫ్యూచర్‌ ఏంటి? తాను ప్రయాణిస్తున్న కారు ఎంతవరకు తీసుకుపోతుంది..? హుజూరాబాద్‌ బైపోల్‌లో ప్లేయర్‌గా ఉంటారా? లేరా? స్వయంగా CM KCR కండువా కప్పి ఆహ్వానించే సరికి కచ్చితంగా కౌశిక్‌కే టిక్కెట్‌ కన్ఫామ్‌ అనుకున్నారు. కానీ ముఖ్యమంత్రి చేసిన కొన్ని కామెంట్లు కొత్త డౌట్లను క్రియేట్‌ చేస్తున్నాయి. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు TRS టిక్కెట్‌ తనకేనంటూ ఒక్క ఫోన్‌కాల్‌తో పెద్ద దుమారమే రేపిన కౌశిక్‌రెడ్డి.. గులాబీ కండువా కప్పుకున్నారు. TRS అధినేత, CM KCR స్వయంగా ఆయనకు కండువా కప్పి ఉజ్వల భవిష్యత్తు ఉందని భరోసా ఇచ్చారు.

ఆ భవిష్యత్తు ఎలా ఉంటుందనే చర్చ కౌశిక్‌రెడ్డి అనుచరుల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. హుజూరాబాద్‌ టిక్కెట్‌పై ముందు నుంచి ఆశలు పెట్టుకున్నారు కౌశిక్‌. అందుకు తగ్గట్టే కాంగ్రెస్‌లో ఉండి కూడా తనకే టీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ అని చెప్పుకున్నారు. కాకపోతే పార్టీలోకి చేరే సందర్భంగా CM KCR చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆందోళనకు గురిచేసినట్లు తెలుస్తోంది.

కౌశిక్‌రెడ్డి స్పోర్ట్స్‌ కెరియర్‌ గురించి ముఖ్యమంత్రి ప్రస్తావించారు. మంచి ఆటగాడు, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్లేయర్‌ అంటూ KCR చేసిన వ్యాఖ్యలు కౌశిక్ శిబిరంలో టెన్షన్‌ను రేపుతున్నాయి. టిక్కెట్టు ఇస్తారనుకుంటే స్పోర్ట్స్ అంటూ శాట్స్‌ ఛైర్మన్‌ పదవి ఇచ్చి ఉసూరుమనిమిస్తారా ఏంటి..? అనే ఆందోళన కౌశిక్‌ టీమ్‌లో మొదలైనట్లుగా తెలుస్తోంది.

ఆయన పార్టీలో చేరిన సందర్భంగా దాదాపు గంటసేపు మాట్లాడిన ముఖ్యమంత్రి ఎక్కడా హుజూరాబాద్‌లో పోటీ గురించి ప్రస్తావించలేదు. గతంలో కౌశిక్‌రెడ్డి పోటీ చేసి ఓడిపోయిన సందర్భాన్ని గుర్తుచేయలేదు. కేవలం ఆయనకు మంచి ఫ్యూచర్‌ అని ఉందని చెప్పారు.

కౌశిక్‌కు ఇచ్చే స్థానంపై ముందే ఫిక్స్‌ అయిన KCR స్పోర్ట్‌ టాపిక్‌ను ప్రస్తావించారా.. అనే చర్చ పార్టీలో జరుగుతోంది. టిక్కెట్‌ కన్ఫామ్‌ అన్న ప్రకటన చేస్తారని అనుకుంటే ఇలా అయిందే.. ఏంటా.. అని కౌశిక్ అనుచరులు చెవులు కోరుకుంటున్నారట. ఇదిలావుంటే మరి హుజూరాబాద్‌ టిక్కెట్‌ ఎవరికి దక్కుతుందనే అంశం ఇప్పుడు మరింత ఉత్కంఠకు దారి తీస్తోంది. గులాబీ శిబిరంలో రేసు గుర్రం ఎవరుంటారు అనేది ఇప్పుడు హాట్ హాట్‌గా మారింది.

ఇవి కూడా చదవండి: CM KCR: భారీ వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన..

AP Inter Results 2021: ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపు సాయంత్రం ఫలితాలు..