పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ గా సిద్దు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్న సీఎం అమరేందర్ సింగ్
పంజాబ్ కాంగ్రెస్ లో సిద్దు, సీఎం అమరేందర్ సింగ్ మధ్య విభేదాలు ఓ కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తున్నాయి. రాష్ట్ర పార్టీ చీఫ్ గా నవజ్యోత్ సింగ్ సిద్దు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
పంజాబ్ కాంగ్రెస్ లో సిద్దు, సీఎం అమరేందర్ సింగ్ మధ్య విభేదాలు ఓ కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తున్నాయి. రాష్ట్ర పార్టీ చీఫ్ గా నవజ్యోత్ సింగ్ సిద్దు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈయనతో బాటు మరో నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ నిర్ణయించుకున్నారు.తన మద్దతుదారులతో బాటు ఆయన అటెండ్ కానున్నట్టు తెలిసింది. మొదట పంజాబ్ భవన్ లో తనతో టీ కి పార్టీ నేతలను సింగ్ ఆహ్వానించారు. ఆ తరువాత వీరంతా కలిసి పంజాబ్ కాంగ్రెస్ భవన్ కు వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. తన ‘ఇనాగురేషన్ ‘కార్యక్రమానికి హాజరు కావాలని సిద్దు మొదట ముఖ్యమంత్రికి లేఖ రాశారు. తనకు పర్సనల్ అజెండా అంటూ ఏదీ లేదని, ప్రజా అనుకూల అజెండా మాత్రమే ఉందని, అందువల్ల ఈ రాష్ట్ర పార్టీ కుటుంబ పెద్దగా మీరు దీనికి హాజరై కొత్త పీసీసీ టీమ్ ని ఆశీర్వదించాలని ఈ లేఖలో ఆయన కోరారు. దీంతో సింగ్ మెత్తబడినట్టు కనిపిస్తోంది.
తమ నేత రేపటి కార్యక్రమానికి అటెండ్ అవుతారని సీఎం మీడియా సలహాదారు రవీన్ తుక్రాల్ ట్వీట్ చేశారు. కొత్త పీసీసీ టీమ్ లో కొందరితో ఆయన అప్పుడే సమావేశమయ్యారంటూ ఇందుకు సంబంధించిన ఫోటోలను ఈ ట్వీట్లకు జోడించారు. రాష్ట్ర కాంగ్రెస్ లో సంక్షోభం తరువాత సిద్దు..సింగ్ సమావేశం కావడం ఇదే మొదటిసారి అవుతుందని అంటున్నారు. సిద్దు సోషల్ మీడియాలో తనపై చేసిన ట్వీట్లకు అపాలజీ చెప్పాలని అమరేందర్ సింగ్ డిమాండ్ చేసినప్పటికీ రేపటి సమావేశంలో ఇద్దరూ రాజీకి వచ్చే సూచనలు ఉన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: Telangana Rains: తాగిన మైకంలో పొంగిపొర్లుతున్న వాగు మధ్యలో డ్యాన్స్… చివరికి ఏం జరిగిందో మీరే చూడండి
ఊర్లో వింత రూల్.. అక్కడ ఉండాలంటే.. శరీరంలో ఆ పార్ట్ తొలగించుకోవాల్సిందేనట..