AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mekapati Goutham Reddy : ఏపీలో ఐటీ ఉద్యోగాలపై సంచలన ప్రకటన చేసిన మంత్రి మేకపాటి

రాబోయే మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 55 వేల ఐ.టీ ఉద్యోగాలు కల్పిస్తామని ఏపీ ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పారు. ఐటీ రంగంలో ఉన్నత శ్రేణి ఉద్యోగాలు అందించాలన్నదే ప్రభుత్వ..

Mekapati  Goutham Reddy : ఏపీలో ఐటీ ఉద్యోగాలపై సంచలన ప్రకటన చేసిన మంత్రి మేకపాటి
Mekapati
Venkata Narayana
|

Updated on: Jul 22, 2021 | 8:05 PM

Share

Mekapati Goutham Reddy – IT Jobs : రాబోయే మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 55 వేల ఐ.టీ ఉద్యోగాలు కల్పిస్తామని ఏపీ ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పారు. ఐటీ రంగంలో ఉన్నత శ్రేణి ఉద్యోగాలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. విశాఖలో ఐకానిక్‌ టవర్ల ఏర్పాటుపై మంత్రి ఇవాళ అమరావతిలో సమీక్ష నిర్వహించి అధికార్లకు దిశానిర్దేశం చేశారు. ఐటీ, ఎలక్ట్రానిక్‌ ప్రమోషన్లను మరింత పెంచాలని మంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు. సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ద్వారా అత్యాధునిక కోర్సులు, అపార అవకాశాలు ఉన్నాయన్నారు. సీఈవోల ఏర్పాటుపై మరింత శ్రద్ధ వహించాలని మంత్రి సూచించారు.

అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచేందుకు కసరత్తు చేస్తున్నట్టు మంత్రి గౌతమ్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. ఎన్ని ఉద్యోగాలివ్వగలమన్నది నైపుణ్య, శిక్షణ ఎంత మందికి ఇచ్చామన్నదానిపై ఆధారపడి ఉంటుందన్న మంత్రి.. అందుకు తగిన సహకారం, ఏర్పాట్ల గురించి మరింత దృష్టి పెట్టాలన్నారు. ఐ.టీ, ఎలక్ట్రానిక్, మొబైల్ తయారీ, టీవీ తయారీ, స్టీల్ కంపెనీల ద్వారా త్వరలో మరింత ఉపాధి కల్పన దిశగా అడుగులు వేస్తున్నామని, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ల ద్వారా అత్యాధునిక కోర్సులు, అపార అవకాశాలు.. సీవోఈల ఏర్పాటుపై మరింత శ్రద్ధ వహించాలని మంత్రి అధికార్లను కోరారు.

భవిష్యత్ లో వైఎస్ఆర్ కడప జిల్లాలోని కొప్పర్తి ఈఎంసీ ద్వారా ఎక్కువ ఉద్యోగాలు వస్తాయని మంత్రి తెలిపారు. ఐ.టీ, మానుఫాక్చరింగ్ కంపెనీలతో శాఖపరమైన చర్చలు, ఫాలోఅప్ దశల గురించి మంత్రి చర్చించారు. ఏయే మానుఫాక్చరింగ్ కంపెనీలతో సంప్రదింపులు ఏ స్థాయిలో ఉన్నాయో మంత్రికి వైఎస్ఆర్ కడప జిల్లా కొప్పర్తి ఈఎంసీ సీఈవో నందకిశోర్ వివరించారు.

Read also: Telangana Rains : నిర్మల్ జిల్లా ఆటోనగర్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్..! బైంసా యువత సాయంతో ప్రాణాలతో బయటపడ్డ 12 మంది పోలీసులు

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!