AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Poker Game : రాజకీయ అండదండలు.. పోలీసులతో సరిహద్దుల్లో కోతికొమ్మచ్చాడుతోన్న పేకాటరాయుళ్లు.!

అక్కడ బాగా ఫేమస్ ఆ ఆట. ఆడుతునే ఉంటారు.. పట్టుబడుతూనే ఉంటారు. ఐనా పెద్దల అండదండలతో నడుస్తూనే ఉంటుంది. ఏంటి ఆ గేమ్‌?.. ఆ కథేంటో చూడాలంటే..

Poker Game : రాజకీయ అండదండలు.. పోలీసులతో సరిహద్దుల్లో కోతికొమ్మచ్చాడుతోన్న పేకాటరాయుళ్లు.!
Poker Sites
Venkata Narayana
|

Updated on: Jul 22, 2021 | 4:34 PM

Share

Play cards – Poker game – Guntur – Prakasam : అక్కడ బాగా ఫేమస్ ఆ ఆట. ఆడుతునే ఉంటారు.. పట్టుబడుతూనే ఉంటారు. ఐనా పెద్దల అండదండలతో నడుస్తూనే ఉంటుంది. ఏంటి ఆ గేమ్‌?.. ఆ కథేంటో చూడాలంటే, ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం, గుంటూరు జిల్లాలను టచ్ చేయాలి. అక్కడ పేకాట ఆడుకునేందుకు భారీ స్థావరాలు ఉన్నాయి. పేకాట ఆడే జూదరులు గుంటూరు జిల్లాలోనే కాకా, ఇతర జిల్లాల నుండి కూడా ఇక్కడికి ఆడేందుకు వస్తారు. అయితే, తరచూ పోలీస్ దాడుల నేపథ్యంలో పేకాట శిబిరాల నిర్వాహకులు పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు జిల్లా సరిహద్దు ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తుంది.

జూద శిబిరాలపై దాడుల జరిగే సందర్భంలో గుంటూరు జిల్లా పోలీసులు వచ్చినప్పుడు ప్రకాశం జిల్లాలోకి వెళ్లిపోవడం, ప్రకాశం జిల్లా పోలీసులు దాడులకు వచ్చినప్పుడు గుంటూరు జిల్లాకు పారిపోవడం చేస్తున్నారు. ఇదొక అవకాశంగా తీసుకుని నిర్వాహకులు పేకాట స్థావరాలను గుంటూరు – ప్రకాశం జిల్లా సరిహద్దులోనే ఎక్కువగా ఏర్పాటు చేసుకుని మూడు పువ్వులు, ఆరు కాయలుగా పేకాటను కొనసాగిస్తున్నారు. పేకాట ఆడేవారికి నిర్వాహకులు సకల సదుపాయాలు కల్పిస్తారు. ఆటలో నుంచి కొంతభాగం నగదు నిర్వాహణకు తీస్తారు.

ఇక, పేకాట శిబిరాలు నిర్వహించుకునేందుకు రాజకీయ అండను బట్టి ముడుపులు అందుతుంటాయని స్థానికంగా పెద్దఎత్తున ప్రచారం సాగుతోంది. తాజాగా ప్రకాశం, గుంటూరు జిల్లాల సరిహద్దులో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 35 మంది జూదరులు పట్టుబడ్డారు. వారితో పాటు 13 లక్షల 24 వేలు క్యాష్ పట్టుబడింది. 31 ఫోన్లు, వాహనాలు సీజ్ చేశారు ఇంకొల్లు పోలీసులు. పట్టుబడిన వారిలో గుంటూరు, విజయవాడ, నరసరావుపేట, వినుకొండ తదితర ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు.

అయితే, వీరిలో ఓ ప్రజాప్రతినిధి, రౌడీషీటర్‌ ఉన్నారు. వీళ్లిద్దరి అరెస్టు విషయంలో 18 గంటల పాటు హైడ్రామా నడిచింది. స్థానిక పోలీసు అధికారులు ఉన్నతాధికారులతో పలుమార్లు ఫోన్‌లో మాట్లాడారని తెలుస్తోంది. ఎట్టకేలకు రాత్రి 8 గంటల సమయంలో ఇంకొల్లు సీఐ సుబ్బారావు, ఎస్సై జీవీ చౌదరి ఈ బడాబాబుల అరెస్టులను చూపారు. పేకాట నిర్వాహకులకు జిల్లాలోనే పలువురి రాజకీయ అండదండలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది జిల్లా అంతటా.. అదీ కథ.!

Read also: Telangana Rains : యుద్ధ ప్రాతిపాదికన చర్యలు చేపట్టండి.. 16 జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పిలకు సిఎస్ సోమేశ్ కుమార్ ఆదేశాలు