Telangana Rains : యుద్ధ ప్రాతిపాదికన చర్యలు చేపట్టండి.. 16 జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పిలకు సిఎస్ సోమేశ్ కుమార్ ఆదేశాలు

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపధ్యంలో తక్షణ చర్యలను యుద్ధ ప్రాతిపాదికన చేపట్టాలని, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లు, ఎస్‌పి లను..

Telangana Rains : యుద్ధ ప్రాతిపాదికన చర్యలు చేపట్టండి.. 16 జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పిలకు సిఎస్ సోమేశ్ కుమార్ ఆదేశాలు
CS Somesh Kumar
Follow us

|

Updated on: Jul 22, 2021 | 3:31 PM

Telangana Rains alert – CS Somesh Kumar : రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపధ్యంలో తక్షణ చర్యలను యుద్ధ ప్రాతిపాదికన చేపట్టాలని, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లు, ఎస్‌పి లను ఆదేశించారు. ఇవాళ (గురువారం) ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన 16 మంది కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో వరదల పరిస్ధితిపై సీఎస్ సమీక్షించారు. జిల్లా కేంద్రాలలో కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్ధితులను సమీక్షించాలని, ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని సూచించారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని.. జిల్లాలలోని అన్ని శాఖలు సమన్యయంతో పనిచేయాలని.. చెరువులు, కుంటలు, గండ్లు పడకుండా చూసుకోవాలని సీఎస్ సోమేశ్ కుమార్ సూచించారు. త్రాగునీరు, విద్యుత్తు సరఫరా, పారిశుద్ధ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అవసరం మేరకు ప్రభుత్వం అన్ని రకాల సహాయక సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ విషయమై ఆయా జిల్లా కలెక్టర్లు విపత్తు నిర్వహణ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ బొజ్జాతో సంప్రందించాలని తెలియజేశారు.

డిజిపి మహేంద్ర రెడ్డి, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, లెఫ్టినెంట్ కల్నల్ కమల్ దీప్, డిజి ఫైర్ సర్వీసెస్ ఎస్ కె జైన్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, డిజాస్టర్ మేనేజ్ మెంట్ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ బొజ్జా, సిఎండి NPDCL, గోపాల్ రావు, పంచాయతీ రాజ్ కమిషనర్ రఘునందన్ రావు, నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ ఛీఫ్ మురళీధర్ రావు, NDRF అధికారి దామోదర్ సింగ్ ఇంకా ఇతర అధికారులు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

Read also: Hyderabad Rains : హైదరాబాద్‌లో నాన్ స్టాప్ వాన.. నడుం లోతులో లోతట్టు ప్రాంతాలు, ట్రాఫిక్‌కు ఆటంకం