LRS Telangana: అవన్నీ కట్టుకథలే.. LRS ప్రక్రియపై క్లారిటీ ఇచ్చిన సర్కార్..
lrs telangana: LRS స్కీమ్‌పై క్లారిటీ ఇచ్చింది తెలంగాణ సర్కార్. LRS దరఖాస్తులకు మోక్షం లభించబోతోంది. LRS దరఖాస్తుల పరిష్కారంపై దృష్టి సారించింది. కేవలం 15 రోజుల్లో పరిష్కారం అంటూ వస్తున్న వార్తలను

LRS స్కీమ్‌పై క్లారిటీ ఇచ్చింది తెలంగాణ సర్కార్. LRS దరఖాస్తులకు మోక్షం లభించబోతోంది. LRS దరఖాస్తుల పరిష్కారంపై దృష్టి సారించింది. కేవలం 15 రోజుల్లో పరిష్కారం అంటూ వస్తున్న వార్తలను ఖండించింది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ఇప్పటికిప్పుడు దరఖాస్తుల పరిష్కారంపై దృష్టి పెట్టడం కుదరదని తేల్చి చెప్పింది. న్యాయస్థానం నుంచి వచ్చే ఆదేశాలకు అనుగూణంగానే నిర్ణయం ఉంటుందని వెల్లడించారు.
20.07.2021 న జారీచేసిన Memo No. 1730/P3/2021,గ్రామ పంచాయితీలు / మునిసిప్లలిటీలు / కార్పొరేషన్లు తమ వార్డుల్లో వచ్చిన LRS దరఖాస్తుల క్షేత్ర పరిశీలన .. గ్రామం, వార్డు, సర్వే నెంబర్, కాలనీల వారిగా క్లస్టర్లుగా విభజించాలని ఆదేశిండం జరిగిందని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కొన్ని పత్రికల్లో అందుకు విరుద్దంగా వార్తలను ప్రచూరించినట్లుగా వారు పేర్కొన్నారు. 15 రోజుల్లో పెండింగ్ లో ఉన్న అన్ని LRS దరఖాస్తులు పరిష్కరం అంటూ వచ్చినట్లుగా తెలిపారు.
ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు 25.59 లక్షల ప్లాట్లకు దరఖాస్తులు వచ్చాయి. HMDA పరిధిలో నాలుగున్నర లక్షలకు పైగా అప్లికేషన్లు రాగా.. 2015 నాటి పెండింగ్ దరఖాస్తులకు పరిష్కారం చూపనున్నారు.

Lrs Applications
మరోవైపు.. రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ భూములు, కమర్షియల్ ప్లాట్లపై రిజిస్ట్రేషన్ రుసుం పెంచింది. కేటగిరీల వారీగా రిజిస్ట్రేషన్ చార్జీల్ని పెంచింది. పెరిగిన చార్జీలను నేటి నుంచి అమలు చేయనున్నారు.
