Breaking: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. ఆ రోజున కౌంటింగ్
Eluru Municipal Corporation Counting: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు లైన్ క్లియర్ అయింది. ఏలూరు కార్పొరేషన్..
Eluru Municipal Corporation Counting: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు లైన్ క్లియర్ అయింది. ఏలూరు కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం అనుమతి ఇచ్చింది. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఈ నెల 25వ తేదీన ఓట్లు లెక్కించాలని అధికారులకు సూచించింది. ఇక కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. మార్చి 10వ తేదీన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగిన విషయం విదితమే.
కాగా, ఏపీలో 75 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లకు మార్చి 10న ఎన్నికలు ముగిశాయి. అయితే ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాలో తప్పులున్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. సింగిల్ జడ్జి ఎన్నికలపై స్టే విధించగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఓ పిటీషనర్ ఆ తీర్పును సవాలు చేశారు. దానిపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి నేృతృత్వంలోని ధర్మాసనం ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు అనుమతిచ్చారు. అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టకూడదని ఆదేశాలిచ్చింది.
Also Read:
ఓర్నీ దుంపతెగ.! పులికి ఎదురెళ్లి ‘హలో బ్రదర్’ చెప్పాడు.. క్రేజీ వీడియో వైరల్..
వాహనదారులకు గుడ్ న్యూస్.. దేశంలో తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.! వివరాలివే..
ఈ ఫోటోలోని చిన్నది ఇప్పుడొక క్రేజీ హీరోయిన్.. ఫ్యాన్స్ ముద్దుగా ఏమని పిలుస్తారో తెలుసా.!
బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే అదిరిపోయే బైకులు.. 84 కిలోమీటర్ల మైలేజ్.!