- Telugu News పొలిటికల్ ఫొటోలు Andhra pradesh cm ys jagan released ysr kapu nestham second year funds beneficiaries
ఏపీలో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు.. ‘వైఎస్సార్ కాపునేస్తం’ లబ్దిదారుల హర్షం.. చిత్రాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది ‘వైఎస్సార్ కాపు నేస్తం’ పథకాన్ని అమలు చేసింది. సీఎం వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా లబ్ధిదారుల ఖతాల్లో డబ్బులు జమ చేశారు.
Updated on: Jul 22, 2021 | 2:52 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది ‘వైఎస్సార్ కాపు నేస్తం’ పథకాన్ని అమలు చేసింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,27,244 మంది పేద మహిళలకు రూ.490.86 కోట్ల ఆర్థిక సాయాన్ని గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా లబ్ధిదారుల ఖతాల్లో డబ్బు విడుదల చేశారు. ఈ మొత్తాన్ని బ్యాంకులు పాత అప్పుల కింద జమ చేసుకోకుండా అన్ ఇన్‌కమ్‌బర్డ్ ఖాతాల్లో నగదు జమ చేశారు.

కాపుల్లో నిరుపేదల ఉన్న వారికి 'వైఎస్‌ఆర్ కాపు నేస్తం' అందిస్తున్నామని, అర్హులైన కాపు మహిళలకు ఏటా రూ.15 వేలు ఆర్ధిక సాయం, ఐదేళ్లలో మొత్తం రూ.75 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వెనక్కి తగ్గకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు.

గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అగ్రవర్ణ పేదలకు ప్రయోజనాలు అందని పరిస్థితి ఏర్పడిందని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అమలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ రిజర్వేషన్లతో కాపులకు మేలు జరుగుతుందని, విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో అయా జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా ఉన్నతాధికారులతో పాటు లబ్ధిదారులు పాల్గొన్నారు.

‘వైఎస్సార్ కాపునేస్తం’ లబ్దిదారులు.. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై సంతోషం వ్యక్తం చేశారు. ‘జగనన్న ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పాఠ్యాంశంగా పెడితే పెద్ద పుస్తకం అవుతుందని అంటున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి పథకం అందరికి పారదర్శకంగా.. అవినీతికి తావు లేకుండా ప్రతి రూపాయి లబ్ధిదారులకు చేరాలని అభిప్రాయపడ్డారు.

ఇచ్చిన ప్రతిమాటను ముఖ్యమంత్రి జగన్ నెరవేర్చారని మంత్రి పేర్నినాని అన్నారు. వివిధ కార్యక్రమాల ద్వారా 59 లక్షల మందికిపైగా కాపులకు లబ్ధి పొందారని గుర్తుచేశారు. కరోనా కష్టకాలంనూ సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. చెప్పిన ప్రతిమాటను సీఎం జగన్ నిలబెట్టుకున్నారని పేర్నినాని పేర్కొన్నారు.





























