AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amravati lands Case: అమరావతి భూముల ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ కేసులో కీలక మలుపు.. అప్పీల్ పిటిషన్ వెనక్కి తీసుకున్న ఏపీ సర్కార్..!

అమరావతి భూముల కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Amravati lands Case: అమరావతి భూముల ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ కేసులో కీలక మలుపు.. అప్పీల్ పిటిషన్ వెనక్కి తీసుకున్న ఏపీ సర్కార్..!
Balaraju Goud
|

Updated on: Jul 22, 2021 | 12:05 PM

Share

AP Govt. on Amravati lands Case: అమరావతి భూముల ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ కేసులో కీలక మలుపు.. అప్పీల్ పిటిషన్ వెనక్కి తీసుకున్న ఏపీ సర్కార్..! అమరావతి భూముల కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ రాజధాని భూముల క్రయవిక్రయాలకు సంబంధించి హైకోర్టులో దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను ఏపీ సర్కార్ వెనక్కు తీసుకుంది. రెండ్రోజుల క్రితం ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతికూలంగా సుప్రీం తీర్పు వెలువరించిన నేపథ్యంలో దమ్మాలపాటి కేసు పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నట్లు ఆంధ్ర ప్రభుత్వం తెలిపింది.

అమరావతి భూముల వ్యవహారంలో విచారణపై స్టే ఇవ్వడంతో పాటు ఈ అంశంపై మీడియాలో కథనాలు ప్రసారం చేయకుండా ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు. మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి కేసులో హైకోర్టు ఆదేశాలను సవాల్ చేసింది ఏపీ సర్కార్. అయితే, ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంను ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. రెండ్రోజుల క్రితం ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతికూలంగా సుప్రీం తీర్పు ఇచ్చింది. దీంతో తన అప్పీల్‌ను వెనక్కు తీసుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.

Read Also

కోర్టుల్లో పెండింగ్ కేసుల విచారణలో విపరీత జాప్యం.. సుప్రీంకోర్టు తీర్పు వినకుండానే 108 ఏళ్ళ పిటిషనర్ మృతి