కోర్టుల్లో పెండింగ్ కేసుల విచారణలో విపరీత జాప్యం.. సుప్రీంకోర్టు తీర్పు వినకుండానే 108 ఏళ్ళ పిటిషనర్ మృతి

దేశంలోని కోర్టుల్లో పెండింగ్ కేసులు పెరిగిపోతుండడంపై సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ ఇటీవల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పరిష్కారానికి నోచుకోకుండా వేల కేసులు పెండింగులో పడిపోతున్నాయని ఆయన అన్నారు. ఇందుకు ఉదాహరణగా మహారాష్ట్రలో..

కోర్టుల్లో పెండింగ్ కేసుల విచారణలో విపరీత జాప్యం.. సుప్రీంకోర్టు తీర్పు వినకుండానే 108 ఏళ్ళ పిటిషనర్ మృతి
Supreme Court Warns Against Clampdown On Dissemination
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Jul 22, 2021 | 12:04 PM

దేశంలోని కోర్టుల్లో పెండింగ్ కేసులు పెరిగిపోతుండడంపై సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ ఇటీవల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పరిష్కారానికి నోచుకోకుండా వేల కేసులు పెండింగులో పడిపోతున్నాయని ఆయన అన్నారు. ఇందుకు ఉదాహరణగా మహారాష్ట్రలో సోపన్ నర్సింగా గైక్వాడ్ అనే వ్యక్తి ఉదంతమే తీసుకుంటే.. 1968 లో ఈయన ఓ రిజిస్టర్డ్ సేల్ డీడ్ నుంచి కొంత స్థలాన్ని కొన్నాడు. అయితే అప్పటికే ఆ స్థలాన్ని సదరు వ్యక్తి బ్యాంకుకు తనఖా పెట్టి రుణం తీసుకున్నాడు. కానీ ఆ అప్పు తీర్చలేకపోవడంతో సదరు బ్యాంకు గైక్వాడ్ కి నోటీసు పంపింది. ఇక అప్పటినుంఛీ ఈయన ఆ నోటీసును సవాలు చేస్తూ మొదట బాంబే హైకోర్టుకెక్కాడు. కానీ వివిధ కారణాల వల్ల కోర్టు దీని విచారణను వాయిదా వేస్తూ వచ్చింది. చివరకు ఇది పెండింగ్ కేసు లిస్టులో పడిపోయింది. 27 ఏళ్ళ తరువాత ఆ కోర్టు ఇతని పిటిషన్ ని కొట్టివేసింది. కానీ గైక్వాడ్ ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకెక్కాడు. ఈ అప్పీలును కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగడానికి ఎందుకంత కాలం పట్టిందని న్యాయమూర్తులు జస్టిస్ వై.వి. చంద్రచూడ్, హృషీకేశ్ రాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యలో కోవిడ్ మహమ్మారి కారణంగా జాప్యం జరిగిందనుకున్నా..మరి అంతకు ముందు హైకోర్టు దీన్ని ఎందుకు పరిష్కరించలేదని, సుదీర్ఘ కాలం పెండింగులో ఉంటే పిటిషన్ ని కొట్టివేస్తారా అని వీరు ప్రశ్నించారు. 2015, 2019 లో కూడా కోర్టు ఉత్తర్వుల విషయంలో గైక్వాడ్ వారసులకు తెలియజేయడంలో జాప్యం జరిగిందన్నారు. చివరకు అత్యున్నత న్యాయస్థానం తన కేసులో ఏ తీర్పు ఇస్తుందో తెలియక ముందే 108 ఏళ్ళ ఈ వృధ్ధ పిటిషినర్ మృతి చెందాడు. ఇక ఆయన వారసుల వాదనను సుప్రీంకోర్టు ఆలకించాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చూడండి : News Watch Video: కరీంనగర్ జిల్లాతో నాకు సెంటిమెంట్ ఉంది..మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )

 వీడెం పెళ్లికొడకురా బాబు..ఇలా ఉన్నాడు..!పెళ్లి వేడుక లోనే ఆగ్రహం చూపించాడు..షాక్ లో నెటిజన్లు..:Groom And Bride Video.

 “రాజ విక్రమార్క”‏గా రాబోతున్న యంగ్ హీరో.. ఎట్ట్రాక్ట్ చేస్తున్న హీరో కార్తికేయ డిఫరెంట్ గెటప్‍..:Hero Karthikeya New Look Video.

 ఆసక్తికరంగా మారిన పాము, ముంగీస నడుమ హోరాహోరీ..ఆసక్తి రేపుతున్న వీడియో..:Snake and Mongoose Video.