Guntur: గుంటూరు జిల్లాలో బెంజ్ కారు దగ్ధం.. విచారణలో పోలీసులు మైండ్ బ్లాంక్

Benz Car: కొందరు ఇన్సూరెన్స్‌ కోసం కక్కుర్తిపడి ఎన్నో ఘటనలకు పాల్పడుతుంటారు. వ్యాపారం విషయంలో, కార్ల విషయాల్లో ఇన్సూరెన్స్‌ కోసం భవనాన్ని తగులబెట్టడం, కార్లను తగులబెట్టడం..

Guntur: గుంటూరు జిల్లాలో బెంజ్ కారు దగ్ధం.. విచారణలో పోలీసులు మైండ్ బ్లాంక్
Follow us
Subhash Goud

| Edited By: Ram Naramaneni

Updated on: Jul 22, 2021 | 3:19 PM

Benz Car: కొందరు ఇన్సూరెన్స్‌ కోసం కక్కుర్తిపడి ఎన్నో ఘటనలకు పాల్పడుతుంటారు. వ్యాపారం విషయంలో, కార్ల విషయాల్లో ఇన్సూరెన్స్‌ కోసం భవనాన్ని తగులబెట్టడం, కార్లను తగులబెట్టడం లాంటి చేస్తుంటారు. ఎందుకంటే ఇలాంటి వాటికి పాల్పడితే పెద్ద ఎత్తున ఇన్సూరెన్స్‌ వస్తుందనే ఆశ. అయితే ఇన్సూరెన్స్‌ కోసం కక్కుర్తిపడి సొంత కారునే తగులబెట్టి కేసుల పాలయ్యాడు ఓ వ్యక్తి. ఈనెల 18న తేదీ రాత్రి గుంటూరు జిల్లా పెదకాకాని మండల పరిధిలోని తక్కెళ్ళపాడు ఫ్లైఓవర్‌ బ్రిడ్జి వద్ద కారు తగులపడుతుందన్న సమాచారం మేరకు సీఐ సురేష్‌ బాబు తన సిబ్బందితో అక్కడికి వెళ్లారు. బెంజ్‌ కారు తగలపడడం చూసి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. కారులో కానీ చుట్టుపక్కల ఎవరూ లేకపోవడం గమనించిన సీఐ ప్రమాదవశాత్తూ కారు తగలబడలేదని నిర్ధారణకు వచ్చారు. అనుమానంతో కారు చుట్టుపక్కల గాలించగా సగం పెట్రోలు ఉన్న బాటిల్‌ కనిపించడంలో ఎవరో కావాలనే కారును తగులబెట్టారని గుర్తించారు. దీనిపై కొంత దర్యాప్తు చేయగా, అసలు విషయం బయటకు వచ్చింది. ఇన్సూరెన్స్‌ కోసమే చేసి ఉంటారన్నది అనుమానం వ్యక్త అయ్యింది. విచారణ ప్రారంభించిన సీఐ సురేష్‌బాబు ఎట్టకేలకు రెండు రోజుల్లోనే కేసును ఛేదించి ముగ్గురిని అరెస్టు చేశారు.

అసలేం జరిగిందంటే..

రెంటచింతలలో అయ్యప్ప ట్రేడర్స్‌ పురుగు మందుల షాపు నిర్వహిస్తోన్న చింతా రవీంద్రారెడ్డి 11 నెలల క్రితం సెకండ్‌ హ్యాండ్‌లో బెంజ్‌ కారు కొనుగోలు చేశాడు. ఆ కారును తన స్నేహితులకు బంధువులకు వివిధ అవసరాల నిమిత్తం వాడుకోవడాని ఇస్తూ ఉంటాడు. అలా తన స్నేహితుడికి ఆ కారు ఇవ్వగా కారు తాళం పోగొట్టటంతో డూప్లికేట్‌ తాళం కోసం ఎన్ని షోరూంలు తిరిగినా లభించలేదు. ఆ తాళం దొరక్కపోవడంతో ఆ కారును తగలబెడితే ఇన్సూరెన్స్‌ డబ్బులు వస్తాయని స్నేహితుల సలహాతో ఆశ పడ్డారు. కక్కుర్తికి ఆశపడ్డ ఆ కారు యజమాని కారును తగులపెట్టడానికి ప్లాన్‌ వేశాడు. ఈ నెల 17న తన ఇద్దరు స్నేహితులు వెంకటేశ్వర్లు, నాగరాజు సాయంతో కారులో బయలుదేరి ఆటోనగర్‌లో బోయింగ్‌ వాహనం అద్దెకు మాట్లాడుకున్నాడు. లాం గ్రామంలో ఉన్న బెంజ్‌ కారును తీసుకొని వచ్చి తక్కెళ్లపాడు ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి దాటాక సర్వీస్‌ రోడ్డు పక్కన పార్క్‌ చేశారు. ఆరోజు రాత్రి వర్షం వల్ల ఆ కారు తగులపెట్టకుండా వెళ్లిపోయారు. మరుసటి రోజు రాత్రి 9 గంటలకు పెట్రోల్‌ తీసుకువచ్చి సుమారు అర్ధరాత్రి 12 గంటల సమయంలో పెట్రోల్‌ పోసి కారును తగలబెట్టి పారిపోయారు. ఈ ఘటనలో నాగరాజు చేతులు, ముఖానికి గాయాలయ్యాయి. ఇక కారును పరిశీలించడానికి వచ్చిన చింతా రవీంద్రరెడ్డితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోడ్డు మీద వెళ్లే వ్యక్తుల ప్రాణాలకు హాని కలుగుతుందన్న నేరంపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

ఇవీ కూడా చదవండి

JioFiber: రిలయన్స్‌ జియో కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్‌.. కేవలం 199 రూపాయలకే 1000జీబీ డేటా..!

Smart Tv: స్మార్ట్‌ టీవీ కొనుగోలు చేసేవారికి అదిరిపోయే ఆఫర్‌.. తక్కువ బడ్జెట్‌లో అధిక ఫీచర్స్‌..!