Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JioFiber: రిలయన్స్‌ జియో కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్‌.. కేవలం 199 రూపాయలకే 1000జీబీ డేటా..!

JioFiber: టెలికాం రంగంలో జియో అనేక సంచలనాలను సృష్టిస్తోంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు మరిన్ని ఆఫర్లను ప్రకటిస్తోంది జియో. తక్కువ ధరలకే ఇంటర్నెట్‌ డేటాను..

JioFiber: రిలయన్స్‌ జియో కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్‌.. కేవలం 199 రూపాయలకే 1000జీబీ డేటా..!
Jiofiber
Follow us
Subhash Goud

|

Updated on: Jul 23, 2021 | 10:10 AM

JioFiber: టెలికాం రంగంలో జియో అనేక సంచలనాలను సృష్టిస్తోంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు మరిన్ని ఆఫర్లను ప్రకటిస్తోంది జియో. తక్కువ ధరలకే ఇంటర్నెట్‌ డేటాను, ఉచిత కాలింగ్‌ సౌకర్యాన్ని వినియోగదారుల కోసం జియో ప్రవేశపెట్టింది. జియో అందించే ఆఫర్ల దెబ్బకు పలు మొబైల్‌ నెట్‌వర్క్‌ కంపెనీలు దిగివచ్చాయి. గత్యంతరం లేక పలు దిగ్గజ మొబైల్‌ నెట్‌వర్క్‌లు ఇంటర్నెట్‌ డేటా ధరలను తగ్గించాయి. ఉచిత కాల్స్‌ను కూడా ప్రవేశపెట్టాయి. 2019 సెప్టెంబర్‌లో జియోఫైబర్‌ను ప్రకటించి రిలయన్స్‌ మరో సంచలనాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా జియో ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను పలు నగరాల్లో ప్రవేశపెట్టింది.

ఈ జియోఫైబర్‌తో పలు ఓటీటీ సేవలను, ఉచిత హెచ్‌డీ వాయిస్‌ కాల్స్‌, హై స్పీడ్‌ ఇంటర్నేట్‌, టీవీ వీడియో కాలింగ్‌, గేమింగ్‌, సెక్యూరిటీ సేవలను యూజర్లకు అందిస్తోంది. జియో ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌లో రూ. 999,1499,2499 డేటా ప్యాకేజీలు ఎక్కువగా ప్రజాదరణను పొందాయి.  ఇతర వెబ్‌సైట్ల ఆధారంగా.. తాజాగా జియో ఫైబర్‌ తన యూజర్ల కోసం అద్బుతమైన ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కేవలం రూ. 199కే 1టీబీ డేటా(1000జీబీ)ను జియోఫైబర్‌ అందిస్తోంది. యూజర్లకు ఈ డేటా సాచెట్‌ ట్యాక్స్‌తో కలిపి 234.82 రూపాయలకు రానుంది. అయితే డేటా ప్యాక్‌ వ్యాలిడిటీ కేవలం ఏడు రోజులు మాత్రమే ఉండనుంది. 1 టీబీ డేటా 100 ఎమ్‌బీపీఎస్‌ స్పీడ్‌తో యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది జియో. డేటా ప్యాక్‌ ముగిసిన తరువాత 1ఎమ్‌బీపీఎస్‌ స్పీడ్‌ వస్తుంది. ఇలా రకరకాల ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తూ జియో కస్టమర్లను ఆకట్టుకుంటోంది.

Disclaimer: ఈ వార్త కేవలం సదరు వెబ్‌సైట్‌లోని సమాచారం ఆధారంగా ప్రచురితమైనది మాత్రం. వాటితో టివీ9 ఛానల్, టీవీ9 వెబ్‌సైట్‌కు ఎలాంటి సంబంధం లేదని మనవి.

ఇవీ కూడా చదవండి

Modi Government: సీనియర్‌ సిటిజన్స్‌కు శుభవార్త.. వారందరికీ రూ.10 వేలు.. కీలక నిర్ణయం తీసుకోనున్న కేంద్రం..?

Visakha Steel: ఢిల్లీ కేంద్రంగా విశాఖ ఉక్కు పోరాటం.. బయలుదేరిన నేతలు.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణ..!