Modi Government: సీనియర్ సిటిజన్స్‌కు శుభవార్త.. వారందరికీ రూ.10 వేలు.. కీలక నిర్ణయం తీసుకోనున్న కేంద్రం..?
Modi Government: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. సీనియర్ సిటిజన్స్‌కు తీపి కబురు అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్..
Modi Government: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. సీనియర్ సిటిజన్స్‌కు తీపి కబురు అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ (అమెండ్‌మెంట్) బిల్లు 2019కు ఆమోద ముద్ర వేయనుంది. ప్రస్తుత వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే మోదీ సర్కార్ ఈ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని సమాచారం. మోదీ సర్కార్ 2019 డిసెంబర్ నెలలోనే మెయింటెనెన్స్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అండ్ పేరెంట్స్ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ అచ్చింది. అయితే పార్లమెంట్‌కు దీనికి ఆమోదముద్ర పడాల్సి ఉంది. తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లను వారి కుటుంబీకులు వదిలేయకుండా చూసుకోవడమే లక్ష్యంగా కేంద్రం ఈ చట్టాన్ని తీసుకువస్తోంది.
తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల ప్రాథమిక అవసరాలను తీర్చడం, వారికి భద్రత కల్పించడం వంటి వాటి ద్వారా వారి సంక్షేమం కోసం ఆసరాగా ఉండటం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. ప్రస్తుత కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల్లో ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే.. ఎంతో మందికి ప్రయోజనం కలుగనుంది. కేంద్ర ప్రభుత్వం మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్అండ్ సీనియర్ సిటిజన్స్ చట్టం 2007కు సవరణలు చేస్తూ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ (అమెండ్‌మెంట్) బిల్లు 2019ను తీసుకువస్తోంది. అయితే ఇది చట్టంగా మారితే.. మెయింటెనెన్స్ చార్జీ కింద రూ.10 వేల కన్నా ఎక్కువ లభించే అవకాశాలున్నాయి. మెయింటెనెన్స్ ట్రిబ్యునల్స్ మెయింటెనెన్స్ చార్జీని నిర్ణయిస్తాయి. పిల్లలు లేదా బంధువులు 15 రోజుల్లోగానే మెయింటెన్స్ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది.