Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పంజాబ్ లో నవజోత్ సింగ్ సిద్దును కలిసిన పార్టీ ఎమ్మెల్యేలపై సీఐడీ నిఘా..రోజురోజుకీ సరికొత్త పరిణామాలు

పంజాబ్ కాంగ్రెస్ కొత్త చీఫ్ నవజోత్ సింగ్ సిద్దును కలిసిన ఎమ్మెల్యేలపై సీఐడీ నిఘా పెట్టారట..వీరిలో ఆప్ సభ్యులు కూడా ఉన్నారు. నిన్న అమృత్ సర్ లోని సిద్దు నివాసానికి వచ్చిన తమ అందరిమీదా సీఐడీ నిఘా పెట్టారని కొంతమంది ఎమ్మెల్యేలు తెలిపారు...

పంజాబ్ లో నవజోత్ సింగ్ సిద్దును కలిసిన పార్టీ ఎమ్మెల్యేలపై సీఐడీ నిఘా..రోజురోజుకీ సరికొత్త పరిణామాలు
Cid Keeps An Eye On Navajot Sidhu Camp In Punjab
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Jul 22, 2021 | 10:04 AM

పంజాబ్ కాంగ్రెస్ కొత్త చీఫ్ నవజోత్ సింగ్ సిద్దును కలిసిన ఎమ్మెల్యేలపై సీఐడీ నిఘా పెట్టారట..వీరిలో ఆప్ సభ్యులు కూడా ఉన్నారు. నిన్న అమృత్ సర్ లోని సిద్దు నివాసానికి వచ్చిన తమ అందరిమీదా సీఐడీ నిఘా పెట్టారని కొంతమంది ఎమ్మెల్యేలు తెలిపారు. బుధవారం ఆయనను 62 మంది సభ్యులు కలిశారన్న వార్త సరి కాదని, 48 మంది ఎమ్మెల్యేలు మాత్రమే భేటీ అయ్యారని తెలిసింది. వీరిలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ముగ్గురు ఆప్ మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. సిద్దు ఇంటిచుట్టూ సాధారణ దుస్తుల్లో ఉన్న సీఐడీ అధికారుల బృందాన్ని మోహరించినట్టు తెలిసింది. అయితే ప్రభుత్వం తమకు అప్పగించిన విధులను తాము నిర్వహిస్తున్నామని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి పేర్కొన్నారు. ఈ ఎమ్మెల్యేల్లో కొందరు గతంలో అక్రమ మైనింగ్, అక్రమ లిక్కర్ ట్రేడింగ్ కి పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. ఆ కేసులను ఇప్పుడు తవ్వి తీయడానికి సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వీరి విషయాన్ని సీఎం సింగ్.. కాంగ్రెస్ హైకమాండ్ ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ దృష్టికి తెచ్చారు. హోషియార్ పూర్ ఏరియాలో ఓ సభ్యుడు అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు పాల్పడగా అతనికి మైనింగ్ శాఖ రూ. 1.65 కోట్ల రికవరీకి సంబంధించి నోటీసు పంపిందని ఆయన వెల్లడించారు.

అయితే తనపై గల ఈ కేసును మాఫీ చేయాలని ఆ ఎమ్మెల్యే సీఎంపై ఒత్తిడి తెచ్చాడని, పైగా కోర్టులో అప్పీలు కూడా చేశాడని సమాచారం. కాగా ఈ ముఖ్యమంత్రి రాజకీయంగా తమను వేధిస్తున్నాడంటూ చరణ్ జిత్ సింగ్ చన్ని అనే ఓ మంత్రే సిద్దు వద్ద వాపోయినట్టు తెలుస్తోంది. సిద్దు శుక్రవారం పార్టీ చీఫ్ గా ప్రమాణం చేయాల్సి ఉంది. ఆ కార్యక్రమానికి అమరేందర్ సింగ్ హాజరవుతారా లేదా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. ఏమైనా పంజాబ్ లో రోజురోజుకీ సరికొత్త పరిణామాలు సంభవిస్తున్నాయి.

మరిన్ని ఇక్కడ చూడండి : వీడెం పెళ్లికొడకురా బాబు..ఇలా ఉన్నాడు..!పెళ్లి వేడుక లోనే ఆగ్రహం చూపించాడు..షాక్ లో నెటిజన్లు..:Groom And Bride Video.

 “రాజ విక్రమార్క”‏గా రాబోతున్న యంగ్ హీరో.. ఎట్ట్రాక్ట్ చేస్తున్న హీరో కార్తికేయ డిఫరెంట్ గెటప్‍..:Hero Karthikeya New Look Video.

 ఆసక్తికరంగా మారిన పాము, ముంగీస నడుమ హోరాహోరీ..ఆసక్తి రేపుతున్న వీడియో..:Snake and Mongoose Video.

 పిల్లిని చూసి కుక్క వాక్.. యాక్టింగ్ లో మించిపోయింది..పిల్లి గాండ్రిపు వైరల్ వీడియో..:Dog played Cat Video.