AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Postal Jobs-2021: పోస్టల్‌ శాఖలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేయండి.. చివరి తేదీ ఆగస్టు 19.. ఎక్కడంటే..!

గ్రామంలోనే ఉంటూ ప్రభుత్వ ఉద్యోగం చేయాలని అనుకునేవారికి మంచి అవకాశం. మంచి జీతంతో పాటు ఇంటి వద్దే పని చేసుకోవచ్చు. అలాంటి ఉద్యోగమే గ్రామీణ్ డాక్ సేవక్..

Postal Jobs-2021: పోస్టల్‌ శాఖలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేయండి.. చివరి తేదీ ఆగస్టు 19.. ఎక్కడంటే..!
Subhash Goud
|

Updated on: Jul 22, 2021 | 9:24 AM

Share

గ్రామంలోనే ఉంటూ ప్రభుత్వ ఉద్యోగం చేయాలని అనుకునేవారికి మంచి అవకాశం. మంచి జీతంతో పాటు ఇంటి వద్దే పని చేసుకోవచ్చు. అలాంటి ఉద్యోగమే గ్రామీణ్ డాక్ సేవక్(Gramin Dak Sevak-GDS). ఈ పోస్టులకు సంబంధించి భారత పోస్టల్ శాఖ నోటిఫికేషన్ జారీ అయ్యింది. జీడీఎస్‌ పోస్టులు పశ్చిమ బెంగాల్ పోస్టల్ సర్కిల్స్ లో అందుబాటులో ఉన్నాయి. గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ ఉద్యోగాలు ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ లో మొత్తం పోస్టుల 2357 ఖాళీలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. బ్రాంచ్ మాస్టర్ పోస్టుకు పే స్కేల్(Pay scale) రూ.12,000లు కాగా.. మిగిలిన పోస్టులకు రూ.10,000వేతనం అందుకోవచ్చు.

ఈ ఉద్యోగానికి 18 నుంచి 40 ఏళ్ల వయసు మధ్య ఉన్న అభ్యర్థులు అర్హులు. దీనిలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయస్సు సడలింపు ఇవ్వగా.. ఓబీసీ అభ్యర్థలుకు మూడు సంవత్సరాలు ఇచ్చారు. అంతేకాకుండా దరఖాస్తుదారులు తప్పనిసరిగా 10వ తరగతిలో గణితం, స్థానిక భాష, ఆంగ్లం సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం, విశ్వవిద్యాలయం, బోర్డులు లేదా ప్రైవేటు సంస్థలు నిర్వహించే కంప్యూటర్ ట్రైనింగ్ కోర్సు సర్టిఫికేట్ ను కలిగి ఉండాలి. లేదా కనీసం 60 రోజుల శిక్షణ కోర్సును కలిగి ఉండే బేసిక్ కంప్యూటర్ కోర్సుకు చెందిన ధ్రువపత్రం సమర్పించాలి

మెట్రిక్యూలేషన్, 12వ తరగతి లేదా అంతకంటే పై విద్యా స్థాయిల్లో కంప్యూటర్ సబ్జెక్టుగా ఉన్న అభ్యర్థులకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ పై ఇచ్చే సర్టిఫికేట్ అవసరం లేదు. ఇది వారికి ఆప్షనల్ మాత్రమేని నోటిఫికేషన్ లో పొందుపరిచారు. అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100లు చెల్లించాలి. మహిళలకు, ట్రాన్స్ మహిళా అభ్యర్థులకు, SC, ST, PWD అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. దరఖాస్తు చేసే అభ్యర్థలు https://appost.in/gdsonline/Home.aspx వెబ్ సైట్ కు వెళ్లి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. వీటికి దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా చివరి తేదీ ఆగస్టు 19, 2021 వరకు ఉంది.

ఇవీ కూడా చదవండి

Navodaya Exam Date: నవోదయ ఎంట్రన్స్‌ పరీక్ష తేదీ ఖరారు.. ఎప్పుడు నిర్వహించనున్నారు? ఎన్ని సీట్లు ఉన్నాయంటే..

IIBF Recruitment: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ అండ్ ఫైనాన్స్‌లో ఉద్యోగాలు.. రూ. 6 లక్షల వార్షిక వేతనం..

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ