IIBF Recruitment: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌లో ఉద్యోగాలు.. రూ. 6 లక్షల వార్షిక వేతనం..
IIBF Recruitment 2021: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (ఐఐబీఎఫ్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ముంబయిలో ఉన్న ఈ సంస్థలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను..
IIBF Recruitment 2021: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (ఐఐబీఎఫ్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ముంబయిలో ఉన్న ఈ సంస్థలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 10 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో కామర్స్/ఎకనామిక్స్/బిజినెస్ మేనేజ్‌మెంట్/ఇన్ఫర్మేషన్/కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. * అభ్యర్థుల వయసు 30-06-2021 నాటికి 28 ఏళ్లు మించకూడదు. * ఎంపికైన వారికి ఏడాదికి రూ. 6 లక్షల జీతాన్ని అందిస్తారు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్యర్థులను ఆన్‌లైన్ ఎగ్జామినేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. * పరీక్షను 200 మార్కులకి నిర్వహిస్తారు. వీటిలో రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. * 140 నిమిషాల నిడివితో నిర్వహించే ఈ పరీక్ష ఇంగ్లిష్‌లో ఉంటుంది. * ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు 05-08-2021 చివరి తేదీగా నిర్ణయించారు. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ICAR Recruitment 2021: B.COM, BBA చేసిన వారికి సువర్ణవకాశం..! ICARలో యంగ్ ప్రొఫెషనల్ జాబ్స్..