Sainik School kalikiri: చిత్తూరు జిల్లా కలికిరి సైనిక్‌ స్కూల్‌లో ఉద్యోగాలు… అర్హులెవరు.. ఎలా అప్లై చేసుకోవాలి.

Sainik School kalikiri Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్న కలికిరి సైనిక్‌ స్కూల్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేశారు. భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ స్కూల్‌లో కాంట్రాక్ట్‌ విధానంలో...

Sainik School kalikiri: చిత్తూరు జిల్లా కలికిరి సైనిక్‌ స్కూల్‌లో ఉద్యోగాలు... అర్హులెవరు.. ఎలా అప్లై చేసుకోవాలి.
Sainik School Recruitment

Sainik School kalikiri Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్న కలికిరి సైనిక్‌ స్కూల్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేశారు. భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ స్కూల్‌లో కాంట్రాక్ట్‌ విధానంలో ఉద్యోగులను తీసుకోనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 18 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 18 పోస్టులకు గాను టీజీటీ (02), ఎల్‌డీసీ (02), ఎంటీఎస్‌ (14) ఖాళీలున్నాయి.
* టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థలు.. సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈడీ/బీఏ ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థుల వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలి.
* ఎల్‌డీసీ పోస్టులకు అప్లై చేసుకునే వారు మెట్రిక్యులేషన్‌ పూర్తి చేసుండాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉండాలి.
* ఎంటీఎస్‌ పోస్టులకు మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణతను అర్హతగా నిర్ధారించారు. దరఖాస్తు చేసుకునే వారి వయసు 18 నుంచి 50 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* టీజీటీ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు జీతంగా అందిస్తారు.
* ఎల్‌డీసీకి సెలక్ట్‌ అయిన వారికి నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు జీతం ఉంటుంది.
* ఎంటీసీ పోస్టులకు ఎంపికై వారికి నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 జీతంగా అందిస్తారు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ 07-08-2021తో ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Exams: ఈనెల 25న బీసీ గురుకులాల ప్రవేశ పరీక్ష.. హెచ్‌సీయూ ఎంట్రన్స్ ఎగ్జామ్ తేదీల్లో మార్పు..

Goldman Sachs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌లో రాబోయే రెండేళ్లలో ఈ కంపెనీలో 2 వేల ఉద్యోగాలు

Telangana Job Fair: నేడు తెలంగాణలో జాబ్‌ ఫెయిర్‌.. 3500 ఖాళీలు.. పది కంపెనీల ఇంటర్వ్యూలు