Goldman Sachs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌లో రాబోయే రెండేళ్లలో ఈ కంపెనీలో 2 వేల ఉద్యోగాలు
Goldman Sachs: గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ గోల్డ్‌మాన్ సాచ్స్‌కు సంబంధించి హైదరాబాద్‌లో కేంద్రాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ క్యాంపస్ ద్వారా..
Goldman Sachs: గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ గోల్డ్‌మాన్ సాచ్స్‌కు సంబంధించి హైదరాబాద్‌లో కేంద్రాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ క్యాంపస్ ద్వారా మరిన్ని సేవలు అందించేందుకు ఆ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. 2023 నాటికి కొత్త నియమాకాలను చేపట్టనున్నట్లు ప్రకటించింది. అయితే ఫైనాన్షియల్ సెక్టార్లో గోల్డ్‌మాన్ సాచ్స్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరుగాంచిన సంస్థ. 2021 మార్చిలో హైదరాబాద్‌లో కార్యాలయం ప్రారంభించింది. ప్రస్తుతం సంస్థలో కేవలం 250 మంది ఉద్యోగులే పని చేస్తున్నారు. రాబోయే రెండేళ్ల కాలంలో హైదరాబాద్ కార్యాలయంలో 2 వేల మంది ఉద్యోగులను నియమించుకోబోతున్నట్లు వెల్లడించింది.
ఏడాది చివరి నాటికి 700 మంది ఉద్యోగులను నియమిస్తామని, ఇందులో 70 శాతం కొత్త వారికే అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొంది. 2023 నాటికి హైదరాబాద్ కార్యాలయంలో 2500 మంది ఉద్యోగులు పని చేసే విధంగా తమ కార్యకలాపాలు విస్తరిస్తామని గోల్డ్‌మాన్ సాచ్స్ వెల్లడించింది. కాగా, భారతదేశంలో తమ ఇంజనీరింగ్, బిజినెస్ ఇన్నోవేషన్ గ్లోబల్ సెంటర్‌ను విస్తరించే కార్యక్రమంలో భాగంగా నగరంలోని రాయదుర్గం ప్రాంతంలో ఏర్పాటు చేసిన గోల్డ్‌మ్యాన్ సాచ్స్ కార్యాలయాన్ని సోమవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అమెరికా కేంద్రంగా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే ప్రతిష్ఠాత్మక సంస్థ గోల్డ్‌మ్యాన్ సాచ్స్ సంస్థ తన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించడం మరింత మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.