AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zoom Five9: టెక్‌ రంగంలో మరో భారీ డీల్‌.. ఫైవ్‌9ను కొనుగోలు చేయనున్న జూమ్‌.. ఒప్పందం విలువ సుమారు రూ. లక్ష కోట్లు..

Zoom Five9 Deal: టెక్నాలజీ రంగంలో మరో భారీ ఒప్పందానికి సర్వం సిద్ధమతున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్‌ విలువ ఏకంగా సుమారు 14.7 బిలియన్‌ డాలర్లు.. మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల లక్ష కోట్ల..

Zoom Five9: టెక్‌ రంగంలో మరో భారీ డీల్‌.. ఫైవ్‌9ను కొనుగోలు చేయనున్న జూమ్‌.. ఒప్పందం విలువ సుమారు రూ. లక్ష కోట్లు..
Zoom Five9 Deal
Narender Vaitla
| Edited By: |

Updated on: Jul 20, 2021 | 10:41 AM

Share

Zoom Five9 Deal: టెక్నాలజీ రంగంలో మరో భారీ ఒప్పందానికి సర్వం సిద్ధమతున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్‌ విలువ ఏకంగా సుమారు 14.7 బిలియన్‌ డాలర్లు.. మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల లక్ష కోట్ల రూపాయలకు పైమాటే. కరోనా కాలం తర్వాత ప్రముఖ వీడియో కాన్ఫరెన్సింగ్‌ సంస్థ జూమ్‌కు ఆదరణ పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యూజర్లకు మరింత మెరుగైన సేవలను అందించే క్రమంలోనే జూమ్‌ ఈ ఒప్పందాన్ని చేసుకోనుందని తెలుస్తోంది. ప్రముఖ క్లౌడ్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రొవెడర్‌ ఫైవ్‌9ను జూమ్‌ కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ డీల్‌ కుదిరితే ఇకపై జూమ్‌కు ఫైవ్‌9 క్లౌడింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ఆపరేటింగ్‌ యూనిట్‌గా మారనుంది. ఈ భారీ డీల్‌ 2022 ఫస్టాఫ్‌లో ఓ కొలిక్కి వస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే జూమ్‌ కంపెనీ ప్రస్తుతం విలువ సుమారు 106 బిలియన్‌ డాలర్లు. ఇండియన్‌ కరెన్సీలో సుమారు రూ. 7,92,450 కోట్లు. ఇక ఫైవ్‌ 9 కంపెనీ విషయానికొస్తే.. ఈ క్లౌడ్‌ ఆధారిత సాఫ్టవేర్‌ కంపెనీ సురక్షితమైన క్లౌడ్ సేవలను అందిస్తోంది. అనేక రకాల ఛానెళ్లలో కస్టమర్ ఇంటరాక్షన్‌ల నిర్వహణ, ఆప్టిమైజేషన్‌ను అనుమతించే సులభమైన యాప్‌. ఈ కంపెనీని కొనుగోలు చేయడం ద్వారా తమ యూజర్లు షేర్‌ చేసుకునే డాక్యుమెంట్లు మరింత సులభంగా ఉంటాయని జూమ్‌ భావిస్తున్నట్లు సమాచారం.

Also Read: Robot: సముద్ర గర్భంలో క్లిష్టమైన పరిశోధనలు..రోబోట్ సిద్ధం చేసిన శాస్త్రవేత్తలు

Google Chrome: మీరు గూగుల్‌ క్రోమ్‌ ఉపయోగిస్తున్నారా..?అయితే తక్షణమే అప్‌డేట్‌ చేసుకోండి

Pegasus: పెగాసస్ స్పైవేర్: మీకు తెలీకుండానే మీ ఫోన్‌ను ఎలా హ్యాక్ చేస్తుంది.. సంచలనంగా మారిన ఫోన్ల హ్యాక్‌

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్