- Telugu News Photo Gallery Technology photos Messaging app whatsapp add new feature for group video call joinable calls feature in whatsapp
WhatsApp New Feature: మరో కొత్త ఫీచర్‌ను యాడ్ చేసిన వాట్సాప్.. ఇకపై గ్రూప్ వీడియో కాల్స్‌లో ఎప్పుడైనా..
WhatsApp New Feature: కరోనా నేపథ్యంలో వీడియో కాల్స్‌కు బాగా ఆదరణ పెరిగింది. ముఖ్యంగా ఉద్యోగులు గ్రూప్ వీడియో కాల్స్‌తో సమాచారాన్ని పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే వాట్సాప్ గ్రూప్ వీడియో కాల్స్‌లో మరో కొత్త ఫీచర్‌ను జోడించింది. దీని ద్వారా..
Updated on: Jul 20, 2021 | 7:44 AM

వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్లను జోడిస్తుంటుంది వాట్సాప్. అందుకే ఇంతటి పోటీలోనూ ఈ మెసేజింగ్ సైట్‌కు ఇంత ఆదరణ లభిస్తోంది.

తాజాగా కరోనా నేపథ్యంలో గ్రూప్ వీడియో కాల్స్‌కు ప్రాధాన్యత పెరిగిన విషయం తెలిసిందే. దీంతో గ్రూప్ వీడియో కాల్స్ ఉపయోగించుకుంటున్న వారి కోసం వాట్సాప్ కొత్తగా మరో ఫీచర్‌ను యాడ్ చేసింది వాట్సాప్.

సాధారణంగా ఎవరైనా మనల్ని గ్రూప్ కాల్‌కు ఇన్వైట్ చేసిన సమయంలో మనం కాల్ లిఫ్ట్ చేయకపోతే.. అప్పటికే ప్రారంభమైన వీడియో సెషన్‌లో మనకు పాల్గొనే అవకాశం ఉండదు.

దీనికి చెక్ పెట్టడానకే వాట్సాప్ 'జాయినబుల్ కాల్స్' అనే ఫీచర్‌ను సోమవారం నుంచి యాడ్ చేసింది. దీంతో యూజర్లు ఏ సమయంలోనైనా గ్రూప్ కాల్స్‌లో జాయిన్ కావొచ్చు.

ఈ విషయాన్ని ఫేస్‌బుక్ ఫౌండర్ మార్క్ జుకర్ బర్గ్ అధికారికంగా తెలిపారు. వాట్సాప్‌లో జాయినబుల్ కాల్స్ ఫీచర్‌ను తీసుకొచ్చామని తెలుపుతూ.. ఇకపై గ్రూప్ వీడియో కాల్‌లో మిస్ అయిన వారు ఎప్పుడైనా జాయిన్ అవ్వొచ్చు అంటూ పోస్ట్ చేశారు.

దీంతో పాటు కాల్ ఇన్ఫో స్క్రీన్ అనే ఆప్షన్‌ను కూడా తీసుకొచ్చారు. దీనిద్వారా అప్పటికే గ్రూప్ కాల్‌లో ఎవరెవరు ఉన్నారు, మిమ్మల్ని వీడియోకాల్‌కు ఎవరు ఇన్వైట్ చేశారన్న విషయాలను తెలుసుకోవచ్చు.




