Blue Origin Spaceflight Today: నేడు అమెజాన్ శ్రీమంతుడి అంతరిక్ష యాత్ర.. విశ్వంలోకి అతిపెద్ద, పిన్న వయస్కులు

Blue Origin Spaceflight Today: అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ ‘బ్లూ ఆరిజిన్‌’కు చెందిన ‘న్యూ షెపర్డ్‌’ వ్యోమనౌకలో మంగళవారం అంతరిక్ష యాత్రకు వెళ్లనున్నారు. అంతరిక్ష పర్యాటకాన్ని..

Blue Origin Spaceflight Today: నేడు అమెజాన్ శ్రీమంతుడి అంతరిక్ష యాత్ర.. విశ్వంలోకి అతిపెద్ద, పిన్న వయస్కులు
Blue Origin Spaceflight Today
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Subhash Goud

Updated on: Jul 20, 2021 | 2:02 PM

Blue Origin Spaceflight Today: అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ ‘బ్లూ ఆరిజిన్‌’కు చెందిన ‘న్యూ షెపర్డ్‌’ వ్యోమనౌకలో మంగళవారం అంతరిక్ష యాత్రకు వెళ్లనున్నారు. అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సాహించే దిశగా ఈ యాత్ర సాగుతుంది. చంద్రుడిపై మానవుడు తొలిసారిగా కాలుమోపిన రోజునే ఈ చరిత్రాత్మక యాత్ర కోసం బెజోస్‌ ఎంచుకున్నారు. అయితే పశ్చిమ టెక్సస్‌ ఎడారిలోని ఓ మారుమూల ప్రాంతంలో ఉన్న లాంచ్‌ సైట్‌ వన్‌ నుంచి మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు (భారత కాలమాన ప్రకారం) న్యూ షెపర్టు దూసుకెళ్లనుంది. ఆయన వెంట ప్రపంచంలోనే అత్యంత పెద్ద, చిన్న వయసు వ్యోమగాములు కూడా ఉన్నారు. ‘వర్జిన్‌ గెలాక్టిక్‌’ సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్‌ బ్రాన్సన్‌ ఇటీవలే విజయవంతంగా అంతరిక్ష యాత్రకు వెళ్లి వచ్చారు.

అయితే ఈ అంతరిక్షయానం చేసే ఉద్దేశం తొలుత ఆయనకు లేదు. బెజోస్‌ తన యాత్ర గురించి ప్రకటన చేయగానే బ్రాన్సన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యాపార ప్రత్యర్థి కన్నా ముందుండాలనే ఉద్దేశంతో జూలై 11న యాత్ర చేపట్టారు. దీంతో స్వీయ వ్యోమనౌకలో రోదసిలోకి వెళ్లొచ్చిన తొలి బిలియనీరుగా ఆయన గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో బెజోస్‌ యాత్ర నిర్వహిస్తున్నారు.

సబ్‌-ఆర్బిటల్‌ యాత్రల విషయంలో ప్రత్యర్థి సంస్థ కన్నా ఒక మెట్టు పైన ఉండేలా ‘న్యూ షెపర్డ్‌’ యాత్ర సాగనుంది. బ్రాన్సన్‌ సంస్థకు చెందిన యూనిటీ-22 వ్యోమనౌక.. భూమి నుంచి సుమారు 88 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న విషయం తెలిసిందే. బెజోస్‌ వ్యోమనౌక మాత్రం 106 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లనుంది. అమెరికా ప్రమాణాల ప్రకారం చూస్తే 80 కిలోమీటర్ల ఎత్తులో అది మొదలవుతుంది.

దీన్ని ప్రామాణికంగా తీసుకుని బ్రాన్సన్‌ 88 కిలోమీటర్ల ఎత్తులోకి వెళ్లి వచ్చారు. అయితే ఫెడరేషన్‌ ఏరోనాటిక్‌ ఇంటర్నేషనల్‌ (ఎఫ్‌ఏఐ) మాత్రం 100 కిలోమీటర్ల ఎత్తు తర్వాత అంతరిక్షం మొదలవుతుందని నిర్వచించింది. ఈ నేపథ్యంలో తమ అంతరిక్షయాత్రపై ఎలాంటి సందిగ్ధతకు తావులేకుండా చూసేందుకు 100 కిలోమీటర్లను దాటి వెళ్లనున్నట్లు బ్లూ ఆరిజిన్‌ పేర్కొంది. ‘న్యూ షెపర్డ్‌’ పూర్తిగా స్వయంచోదిత వ్యోమనౌక. అందువల్ల పైలట్ల అవసరం ఉండదు. ఈ యాత్రకు బెజోస్‌తో పాటు మరో ముగ్గురు ఉన్నారు. మహిళా పైలట్‌ వేలీ ఫంక్‌ (82) ప్రపంచంలోనే ఎక్కువ వయసున్న వ్యోమగామిగా ఆమె రికార్డు సృష్టించనున్నారు. 18 ఏళ్ల ఆలివర్‌ డేమన్‌.. అంతరిక్షంలోకి వెళుతున్న అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందనున్నారు. బెజోస్‌ సోదరుడు మార్క్‌ కూడా యాత్ర చేయనున్నారు.

ఇవీ కూడా చదవండి:

ఐ యామ్ వెరీ హ్యాపీ..జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ స్పేస్ రాకెట్ టీమ్ లో మహారాష్ట్ర యువతి హర్షం

Flights Suspended: భారతీయ విమానాలపై ఆంక్షలను పొడిగించిన కెనడా.. ఎప్పటివరకంటే..?

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..