AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blue Origin Spaceflight : మరికొద్ది నిమిషాల్లో అంతరిక్షంలోకి జెఫ్ బెజోస్ టీం.. స్పేస్ టూరిజంకు ఇదే నాంది..

Blue Origin Spaceflight : మరికొద్ది నిమిషాల్లో అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌, కొంతమంది వ్యోమగాములు ‘బ్లూ ఆరిజిన్‌’కు చెందిన ‘న్యూ షెపర్డ్‌’

Blue Origin Spaceflight : మరికొద్ది నిమిషాల్లో అంతరిక్షంలోకి జెఫ్ బెజోస్ టీం.. స్పేస్ టూరిజంకు ఇదే నాంది..
Jeff Bezos Team
uppula Raju
|

Updated on: Jul 20, 2021 | 5:14 PM

Share

Blue Origin Spaceflight : మరికొద్ది నిమిషాల్లో అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌, కొంతమంది వ్యోమగాములు ‘బ్లూ ఆరిజిన్‌’కు చెందిన ‘న్యూ షెపర్డ్‌’ వ్యోమనౌకలో అంతరిక్ష యాత్రకు బయలుదేరనున్నారు. పశ్చిమ టెక్సాస్‌ ఎడారిలోని ఓ మారుమూల ప్రాంతంలో ఉన్న లాంచ్‌ సైట్‌ వన్‌ నుంచి సాయంత్రం 6.30 గంటలకు (భారత కాలమాన ప్రకారం) న్యూ షెపర్టు దూసుకెళ్లనుంది. ఈ వీడియో లైవ్ వీక్షించాలంటే కింది వీడియోను చూడండి..

ఇటీవల ‘వర్జిన్‌ గెలాక్టిక్‌’ సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్‌ బ్రాన్సన్‌ ఇటీవలే అంతరిక్ష యాత్రకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. నిజం చెప్పాలంటే ఈ అంతరిక్షయానం చేసే ఉద్దేశం తొలుత ఆయనకు లేదు. బెజోస్‌ తన యాత్ర గురించి ప్రకటన చేయగానే బ్రాన్సన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యాపార ప్రత్యర్థి కన్నా ముందుండాలనే ఉద్దేశంతో జూలై 11న యాత్ర చేపట్టారు. దీంతో స్వీయ వ్యోమనౌకలో రోదసిలోకి వెళ్లొచ్చిన తొలి బిలియనీరుగా ఆయన గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బెజోస్‌ యాత్ర నిర్వహిస్తున్నారు. ఈయన వెంట ప్రపంచంలోనే అత్యంత పెద్ద, చిన్న వయసు వ్యోమగాములు ఉన్నారు.

సబ్‌-ఆర్బిటల్‌ యాత్రల విషయంలో ప్రత్యర్థి సంస్థ కన్నా ఒక మెట్టు పైన ఉండేలా ‘న్యూ షెపర్డ్‌’ యాత్ర సాగనుంది. బ్రాన్సన్‌ సంస్థకు చెందిన యూనిటీ-22 వ్యోమనౌక.. భూమి నుంచి సుమారు 88 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న విషయం తెలిసిందే. బెజోస్‌ వ్యోమనౌక మాత్రం 106 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లనుంది. అమెరికా ప్రమాణాల ప్రకారం చూస్తే 80 కిలోమీటర్ల ఎత్తులో అది మొదలవుతుంది. ‘న్యూ షెపర్డ్‌’ పూర్తిగా స్వయంచోదిత వ్యోమనౌక. అందువల్ల పైలట్ల అవసరం ఉండదు. ఈ యాత్రకు బెజోస్‌తో పాటు మరో ముగ్గురు ఉన్నారు. మహిళా పైలట్‌ వేలీ ఫంక్‌ (82) ప్రపంచంలోనే ఎక్కువ వయసున్న వ్యోమగామిగా ఆమె రికార్డు సృష్టించనున్నారు. 18 ఏళ్ల ఆలివర్‌ డేమన్‌.. అంతరిక్షంలోకి వెళుతున్న అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందనున్నారు.

లైవ్ చూడాలంటే కింది వీడియోను వీక్షించండి..

మెగాపవర్ స్టార్‌‌‌కు జోడీగా లక్కీ బ్యూటీ పేరు వినిపిస్తుందే.. శంకర్ సినిమాలో హీరోయిన్ ఆమేనా..

Viral Video: కారు బానెట్‌పై యువకుడు.. ఐదు కిలోమీటర్లు అదే వేగం.. ఇది చూస్తే మీరు ఏమంటారో..

‘గదిలో పది నిమిషాలు కళ్లు మూసుకుంటే పోడుకు పర్మిషన్ ఇస్తానంటారా..?’ ఖబబ్దార్.. సీతక్క తీవ్ర ఆగ్రహం