Flights Suspended: భారతీయ విమానాలపై ఆంక్షలను పొడిగించిన కెనడా.. ఎప్పటివరకంటే..?
Canada suspended flights from India: భారత్‌లో కరోనావైరస్ కేసుల సంఖ్య ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. అయితే.. కరోనాలోని వేరియంట్లు భయభ్రాంతులకు
Canada suspended flights from India: భారత్‌లో కరోనావైరస్ కేసుల సంఖ్య ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. అయితే.. కరోనాలోని వేరియంట్లు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో పలు దేశాలు భారతీయ విమానాలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. తాజాగా భారతీయ విమానాలపై ఉన్న ఆంక్షలను కెనడా ప్రభుత్వం పొడిగించింది. ఆగస్టు 21వ తేదీ వరకు భారతదేశం నుంచి వస్తున్న విమానాలపై సస్పెన్షన్ విధించినట్లు కెనడా ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. భారత్‌లో ఇటీవల డెల్టా ప్లస్ వేరియంట్ విజృంభిస్తున్న కారణంగా విమాన ప్రయాణాలపై మళ్లీ ఆంక్షలు పొడిగించినట్లు కెనడా వెల్లడించింది.
కాగా.. ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన ఇండియా, పాక్ నుంచి వెళ్లే విమానాలపై కెనడా ఆంక్షలను విధించింది. ప్యాసింజర్, బిజినెస్ విమానాలను రద్దు చేసింది. అప్పటినుంచి ఈ ఆంక్షలు కొనసాగుతునే ఉన్నాయి. మధ్యలో సెకండ్ వేవ్ తగ్గినప్పటికీ.. డెల్టాప్లస్ వేరియంట్ ప్రమాదంతో మళ్లీ ఆంక్షలను పొడిగించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ఆగస్టు నుంచి పూర్తిగా వ్యాక్సినేట్ అయిన వారికి అనుమతి కల్పించనున్నట్లు కెనడా చెప్పింది.
ఈ సారి కెనడా ప్రభుత్వం.. సుమారు నాలుగు లక్షల మందికి ఇమ్మిగ్రేషన్ వీసాలు ఇవ్వనున్నట్లు ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు. దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కెనడా ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకుందని పేర్కొంటున్నారు.
Also Read: