Minor Arrest: పది కూడా పాస్ కాలేదు.. ఏకంగా ఫారిన్ నెంబర్లతో దడదలాడించేస్తాడు.. కన్నుపడిదంటే అంతే సంగతులు..

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Jul 20, 2021 | 10:16 AM

Minor Arrested: చూడటానికి పదహారేళ్లే.. పెద్దగా చదువుకోలేదు. కానీ అడ్డదారిలో డబ్బును సంపాదించాలనుకున్నాడు. యూట్యూబ్‌లో వీడియోలను చూసి.. మొబైల్ ఫోన్లు

Minor Arrest: పది కూడా పాస్ కాలేదు.. ఏకంగా ఫారిన్ నెంబర్లతో దడదలాడించేస్తాడు.. కన్నుపడిదంటే అంతే సంగతులు..
Minor Hacker Arrest

Minor Hacker Arrested: చూడటానికి పదహారేళ్లే.. పెద్దగా చదువుకోలేదు. కానీ అడ్డదారిలో డబ్బును సంపాదించాలనుకున్నాడు. యూట్యూబ్‌లో వీడియోలను చూసి.. మొబైల్ ఫోన్లు హ్యాకింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత బాధితులకు ఫోన్ చేసి అడిగినంత డబ్బు ఇవ్వకపోతే.. వారి వ్యక్తిగత వివరాలను బయటపెడతానంటూ బ్లాక్‌మెల్ చేసేవాడు. చివరకు ఆ యువకుడి వేధింపులు తట్టుకోలేని ఓ కుటుంబం ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అనంతరం ఆ యువకుడిని అరెస్టు చేయగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లా మోర్వా పట్టణంలో చోటుచేసుకుంది. మొబైల్ ఫోన్‌లను హ్యాకింగ్ చేసి డబ్బు డిమాండ్ చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసుల సమాచారం ప్రకారం.. మోర్వా పట్టణానికి చెందిన 16ఏళ్ల యువకుడు గత కొన్ని నెలల్లో దాదాపు 25 మందిని లక్ష్యంగా చేసుకున్నాడు. వారందరినీ బ్లాక్ మెయిల్ చేసినట్లు పోలీసులు వివరించారు. కానీ బాధితులెవరూ ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదంటూ పేర్కొన్నారు. ఈ యువకుడు కెనడియన్ ఫోన్ నంబర్‌ను ఉపయోగించి వాట్సాప్ ఖాతాను సృష్టించాడని పేర్కొన్నారు. ఈ వాట్సప్ నెంబర్ ద్వారా ఒక ప్రవాస భారతీయ యువతిగా బాధితులతో చాట్ చేసేవాడు. అనంతరం యువతిగా వలపు వల వేసి.. అశ్లీల వీడియోలు, ఛాయాచిత్రాలను రికార్డ్ చేసి.. బాధితులను డబ్బు డిమాండ్ చేసేవాడు.

చాట్ చేస్తూనే హ్యాకింగ్..

అయితే.. దీనిలో ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. వాట్సాప్ ద్వారా చాట్ చేస్తున్నప్పుడు.. ఆ యువకుడు వారి మొబైల్ ఫోన్‌లను కూడా హ్యాక్ చేస్తాడని పోలీసులు వివరించారు. అలా వారి నుంచి కాంటాక్ట్ నంబర్లు, సోషల్ మీడియా ఖాతాలు, ఛాయాచిత్రాలు, వీడియోలతో సహా డేటాను దొంగిలించేవాడు. ఆ తరువాత బాధితులకు సంబంధించిన అశ్లీల చిత్రాలు, వీడియోలను వారికే పంపి క్యాష్ చేసుకునేవాడు. అయితే.. ఈ ఆన్‌లైన్ హ్యాకర్ పక్కింటి వారికే ఝలక్ ఇచ్చాడు. కొంతకాలం నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో ఆ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. అయితే.. ఈ నిందితుడి టార్చర్ భరించలేక.. ఆ కుటుంబంలోని చాలా మంది సభ్యులు స్మార్ట్‌ఫోన్‌ల వాడకాన్ని ఆపేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాల్స్ రాకుండానే వారి ఫోన్లు రింగ్ అవుతున్నట్లు విచారణలో తేలిందని మోర్వా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి మనీష్ త్రిపాఠి మీడియా సంస్థకు వెల్లడించారు.

పక్కింటి వారికే ఝలక్..

అయితే.. బాధిత కుంటుంబంలోని ఈ సమస్యను పరిష్కరించడానికి ఆ యువకుడు.. డబ్బు సైతం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆ యువకుడిపై అనుమానం రావడంతో వారు పోలీసులును ఆశ్రయించారని.. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే.. పోలీసుల విచారణలో నిందితుడు తన నేరానికి సంబంధించిన వివరాలను వెల్లడించాడని పేర్కొన్నారు. జీపీఎస్ ద్వారా తన స్థానాన్ని మార్చుతూ.. నిషేధించబడిన హ్యాకింగ్ యాప్‌లతో యాక్సెస్ చేస్తున్నాడని తేలిందన్నారు. ముందు ఆ యువకుడు హ్యాకింగ్ స్టడీ మెటీరియల్‌ను, అదేవిధంగా యూట్యూబ్ వీడియోలను చూసి ఈ సైబర్ నేరాలకు పాల్పడినట్లు వెల్లడించారు.

పది కూడా పాస్ కాలేదు..

అయితే.. ఇదంతా చేయడానికి నిందితుడు.. ఎలాంటి క్లాసులకు హాజరు కాలేదని పోలీసులు వివరించారు. రెండేళ్ల క్రితం క్రితం తన పుట్టినరోజున సందర్భంగా తల్లిదండ్రులు ల్యాప్‌టాప్ కొని ఇచ్చారని పోలీసులు తెలిపారు. అప్పటి నుంచి నిందితుడు తన ల్యాప్‌టాప్‌ను రోజుకు 15 గంటలకు పైగా వినియోగిస్తూ ఇలాంటి పనులు నేర్చుకున్నాడని తెలిపారు. అయితే.. ఈ యువకుడు 10వ తరగతిలో రెండుసార్లు ఫెయిల్ అయ్యాడని పోలీసు అధికారి త్రిపాఠి తెలిపారు. కాగా.. ఈ ఘటనపై పలు కోణాల్లోు ఇంకా విచారణ జరుపుతున్నామని.. బాధితులు ఎవరైనా ఉంటే సంప్రదించాలని కోరారు.

Also Read:

Iraq Blast: బాంబులతో దద్దరిల్లుతున్న బాగ్దాద్.. మార్కెట్‌పై దాడి.. 30 మంది దుర్మరణం..

Murder: భార్య, మామను దారుణంగా చంపిన దుర్మార్గుడు.. వెంటాడి.. కత్తితో గొంతుకోసి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu