Murder: భార్య, మామను దారుణంగా చంపిన దుర్మార్గుడు.. వెంటాడి.. కత్తితో గొంతుకోసి..

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Jul 20, 2021 | 7:36 AM

Wife, Uncle brutal murdered: కుటుంబ కలహాలతో ఓ దుర్మార్గుడు.. కట్టుకున్న భార్య, మామను వెంటాడి మరి దారుణంగా చంపాడు. తన సోదరుడి సాయంతో ఇద్దరినీ గొంతుకోసి

Murder: భార్య, మామను దారుణంగా చంపిన దుర్మార్గుడు.. వెంటాడి.. కత్తితో గొంతుకోసి..

Wife, Uncle brutal murdered: కుటుంబ కలహాలతో ఓ దుర్మార్గుడు.. కట్టుకున్న భార్య, మామను వెంటాడి మరి దారుణంగా చంపాడు. తన సోదరుడి సాయంతో ఇద్దరినీ గొంతుకోసి హత్యచేశాడు. ఈ దారుణ ఘటన కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలం శ్రీనివాస్‌నగర్‌ గుట్ట సమీపంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వెల్దికి గ్రామానికి చెందిన లావణ్య(34), అన్నారానికి చెందిన గుడాల రమేశ్‌‌కు కొంతకాలం క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొన్ని రోజుల క్రితం భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో లావణ్య రెండు నెలల క్రితం పుట్టింటికి వచ్చి ఉంటుంది. ఈ క్రమంలో లావణ్య తన భర్తపై కరీంనగర్‌ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అనంతరం పోలీసులు దంపతులిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ఈ విషయమై రమేశ్‌ మనస్తాపం మనస్తాపం చెందాడు.

అనంతరం.. సోమవారం రాత్రి భార్య లావణ్య, మామ ఓదేలు (60) కుమారుడు అజిత్‌, కుమార్తె అక్షిత ఆటోలో వెల్దికి వస్తున్నారు. ఈ క్రమంలో రమేశ్‌, అతని సోదరుడు అనిల్‌ బైక్‌పై వారిని వెంబడించారు. అనంతరం ఆటోను ఆపి భార్య, మామపై దాడిచేసి కత్తితో దారుణంగా గొంతు కోశారు. వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు. తండ్రిని అడ్డుకోబోయిన కుమార్తె చేతికి గాయమైంది. అనంతరం నిందితులిద్దరూ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఏసీపీ విజయసారథి, సీఐ కృష్ణారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. రమేశ్‌ ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

Also Read:

NIA Raids: తెలంగాణలో ఎన్‌ఐఏ కలకలం.. 5 జిల్లాల్లో ఏకకాలంలో సోదాలు… భారీగా పేలుడు పదార్థాల స్వాధీనం!

Raj Kundra Arrest: శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రా అరెస్ట్‌.. యాప్స్‌ ద్వారా పోర్న్‌ సినిమాలు విడుదల చేశారంటూ..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu