AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NIA Raids: తెలంగాణలో ఎన్‌ఐఏ కలకలం.. 5 జిల్లాల్లో ఏకకాలంలో సోదాలు… భారీగా పేలుడు పదార్థాల స్వాధీనం!

తెలంగాణలో ఎన్‌ఐఏ సోదాలు కలకలం సృష్టించాయి. ఐదు జిల్లాల్లో 9 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సోదాలు చేపట్టింది.

NIA Raids: తెలంగాణలో ఎన్‌ఐఏ కలకలం.. 5 జిల్లాల్లో ఏకకాలంలో సోదాలు... భారీగా పేలుడు పదార్థాల స్వాధీనం!
Nia Raids In JK
Balaraju Goud
|

Updated on: Jul 20, 2021 | 7:13 AM

Share

NIA Raids in Telangana: తెలంగాణలో ఎన్‌ఐఏ సోదాలు కలకలం సృష్టించాయి. ఐదు జిల్లాల్లో 9 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సోదాలు చేపట్టింది. మహబూబ్‌నగర్,వరంగల్,జనగామ,యాదాద్రి,మేడ్చల్ జిల్లాల్లోని పలువురి ఇళ్లల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. దుమ్ముగూడెం మావోయిస్టు ఆయుధ, పేలుడు పదార్థాల కేసుకు సంబంధించి ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. ఈ సందర్బంగా భారీగా పేలుడు పదార్థాలతో పాటు తయారీకి సంబంధించి పలు పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు.

తెలంగాణలో పలుచోట్ల ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. దుమ్ముగూడెం మావోయిస్టు ఆయుధ, పేలుడు పదార్థాల కేసులో మహబూబ్‌నగర్‌ జిల్లాలో ముత్తు నాగరాజు, వి.సతీష్‌, మేడ్చల్‌లోని కొమ్మరాజు కనకయ్య, భద్రాద్రి జిల్లాలో గుంజి విక్రమ్‌, త్రినాథరావు, జనగామలో సూర సారయ్య, వరంగల్‌లో వేలుపుస్వామి ఇళ్లలో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో నిందితుల నుంచి పలు పేలుడు పధార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిని మావోయిస్టు నేత హిడ్మాకు రవాణా చేయడానికి ప్లాన్ చేస్తుండగా ఎన్‌ఐఏ అధికారులు పట్టుకున్నారు. పేలుడు పదార్థాల తయారీకి సంబంధించి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

గతంలోనూ తెలంగాణ, ఏపీలో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో అడ్వొకేట్ రఘునాథ్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు. ఆయన ల్యాప్ టాప్‌తో పాటు కంప్యూటర్‌ను పరిశీలించారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బీమా కోరెగావ్ కేసుతో పాటు విశాఖ ముంచింగిపుట్టు కేసులోనూ ఎన్ఐఏ సోదాలు చేసింది. ముంచింగిపుట్టు కేసులో గతంలో 36 మందిపై కేసులు నమోదు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలపాల యాక్ట్‌తో పాటు ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. మావోయిస్టు అగ్రనేతలను తరచూ కలిసి వస్తున్నారని అప్పుడు అభియోగాలు నమోదు చేశారు.

గత ఏడాది నవంబరు 23న నాగన్న అనే వ్యక్తిని పోలీసులు విచారించగా కీలక విషయాలు బయటకొచ్చాయి. పోలీసుల కదలికలను అతడు మావోయిస్టులకు చేరవేస్తున్నట్లు గుర్తించారు. విశాఖ జిల్లా ముంచింగిపుట్టు పోలీసుల నుంచి ఈ వివరాలను కేంద్రహోంశాఖ సేకరించింది. కేంద్రహోంశాఖ ఆదేశాల మేరకు హైదరాబాద్ ఎన్ఐఏ దర్యాప్తు చేసింది. ఎన్‌ఐఏ సోదాలను విరసం, పౌర హక్కుల సంఘాల నేతలు అప్పుడు వ్యతిరేకించారు. సోదాల పేరుతో తమను వేధిస్తున్నారని.. పౌర హక్కుల నేతలను భయపెట్టేందుకే సోదాలు చేస్తున్నారని ఆరోపించారు.

Read Also…  TS Registration Charges: మరో కీలక నిర్ణయం.. తెలంగాణలో రేపటి నుంచి రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెంపు..!