Moderna vaccine: భారత్‌కు 75 లక్షల మోడెర్నా వ్యాక్సిన్ డోసులు.. అందించనున్న డబ్ల్యూహెచ్ఓ

Moderna Covid-19 Vaccine: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 41 కోట్లకు వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే భారత్‌కు

Moderna vaccine: భారత్‌కు 75 లక్షల మోడెర్నా వ్యాక్సిన్ డోసులు.. అందించనున్న డబ్ల్యూహెచ్ఓ
Moderna Vaccine
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 20, 2021 | 10:51 AM

Moderna Covid-19 Vaccine: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 41 కోట్లకు వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే భారత్‌కు మరి కొద్ది రోజుల్లోనే 7.5 మిలియన్‌ డోసుల మోడెర్నా కోవిడ్‌ వ్యాక్సిన్ డోసులు లభించనున్నాయి. అయితే.. ఈ వ్యాక్సిన్ ఇంకా భారత్‌లోకి రాలేదు. ప్రపంచంలో ఫైజర్ వ్యాక్సిన్ తర్వాత అత్యధికంగా వినియోగిస్తున్న వ్యాక్సిన్.. మోడెర్నా. అయితే.. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీలో అసమానతలు చోటు చేసుకోకుడదనే ఉద్దేశ్యంతో డబ్ల్యూహెచ్‌వో రూపొందించిన కోవ్యాక్స్ ప్రోగ్రాం కింద భారత్‌కు 75 లక్షల మోడెర్నా వ్యాక్సిన్ డోసుల అందజేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ సోమవారం వెల్లడించారు. అయితే ఈ మోడెర్నా వ్యాక్సిన్ డోసులు భారత్‌కు ఎప్పటివరకు చేరుకుంటాయనే విషయాన్ని మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. ఈ వ్యాక్సిన్ లభ్యత ఆధారంగా సరఫరా ముడిపడి ఉంటుందని ఖేత్రపాల్ తెలిపారు.

ఇదిలాఉంటే.. భారత్‌లో మోడెర్నా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ గత నెలలోనే అనుమతులు ఇచ్చింది. అయితే ఈ అనుమతులు పూర్తి స్థాయిలో ఇంకా లభించాల్సి ఉంది. ఫార్మా సంస్థ సిప్లా ఈ వ్యాక్సిన్‌ను దేశంలో దిగుమతి చేసుకుంటుందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం పరిశీలన ఉంటుందని అధికారులు వెల్లడించారు.

అయితే.. ఈ విషయంలో ఇప్పటికే మోడెర్నా కంపెనీతో చర్చలు జరుపుతున్నట్లు ఇటీవలే నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ కూడా వెల్లడించారు. వాక్సిన్ ఉత్పత్తి, సరఫరా పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వం మోడెర్నా, ఫైజర్‌ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాంట్రాక్టుపై ఆయా కంపెనీలతో చర్చలు కొనసాగుతున్నాయన్నారు.

Also Read:

Covid vaccine: వ్యాక్సిన్ తీసుకుంటే ప్రాణాలకు ముప్పు తప్పినట్లే.. ఐసీఎంఆర్ అధ్యయనంలో కీలక విషయాలు

Covid-19 vaccine: గుడ్ న్యూస్.. త్వరలోనే పిల్లలకు కరోనా వ్యాక్సిన్.. వెల్లడించిన కేంద్రం