AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajdhani Express: రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు తేజస్‌ స్మార్ట్‌ స్వీపర్‌ కోచ్‌లు.. అద్భుతమైన సౌకర్యాలు

Rajdhani Express: ముంబై రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైలులో వెస్ట్రన్‌ రైల్వే కొత్తగా అప్‌గ్రేడ్‌ చేసిన తేజన్‌ స్వీపర్‌ కోచ్‌లను ప్రవేశపెట్టినట్లు కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది. కొత్త..

Rajdhani Express: రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు తేజస్‌ స్మార్ట్‌ స్వీపర్‌ కోచ్‌లు.. అద్భుతమైన సౌకర్యాలు
Rajdhani Express
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 20, 2021 | 10:49 AM

Share

Rajdhani Express: ముంబై రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైలులో వెస్ట్రన్‌ రైల్వే కొత్తగా అప్‌గ్రేడ్‌ చేసిన తేజన్‌ స్వీపర్‌ కోచ్‌లను ప్రవేశపెట్టినట్లు కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది. కొత్త కోచ్‌లు మెరుగైన సౌకర్యాలతో ఉత్తమ ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయితే తేజస్‌ స్మార్ట్‌కోచ్‌ సౌకర్యంతో సుదూర ప్రయాణంలో ప్రయాణికులకు మధురానుభూతి కలిగిస్తుందని తెలిపింది. రైలు నెంబర్‌ 02951/52 ముంబై – న్యూఢిల్లీ రాజధాని స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌లో తేజస్‌ తరహా స్వీపర్‌ కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.

కాగా, భారతీయ రైల్వే ప్రయాణికులు తమ జర్నీని సౌకర్యవంతంగా పూర్తి చేసేందుకు భారతీయ రైల్వే అన్ని చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా రైలు కోచ్‌లల్లో మార్పులు చేస్తోంది. ప్రస్తుతం తేజస్ రైళ్లల్లో ఉన్నట్టుగా ఇతర రైళ్లల్లో కోచ్‌లను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం భారతీయ రైల్వే దేశంలోని పలు రూట్లల్లో తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతోంది. ఆ రైళ్లల్లో ఉన్న సౌకర్యాలు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. అందుకే తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో ఉన్న కోచ్‌లను ఇతర కోచ్‌లల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఈ స్లీపర్ కోచ్‌లల్లో అనేక స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి. ఆటోమెటిక్ ప్లగ్ డోర్, స్టెయిన్‌లెస్ స్టీల్ అండర్‌ఫ్రేమ్, బయో వ్యాక్యూమ్ టాయిలెట్ సిస్టమ్, ఎయిర్ సస్పెన్షన్ బోగీలు, ఫైర్ అలారం, డిటెక్షన్, సప్రెషన్ సిస్టమ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. అలాగే రైలు లోపల అద్భుతమైన ఇంటీరియల్, సీసీటీవీ కెమెరాలు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్, బయో టాయిలెట్స్, డిజిటల్ డెస్టినేషన్ బోర్డ్, అత్యవసర పరిస్థితుల్లో సాయం కోసం ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ లాంటివి కూడా అందుబాటులో ఉంటాయి. దూర ప్రయాణం చేయాలనుకునేవారికి ఇలాంటి కోచ్‌లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.

ఇలాంటి మరో 500 కోచ్‌లను తయారు చేయిస్తోంది భారతీయ రైల్వే. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ కోచ్‌లు తయారవుతున్నాయి. 2021-22 సంవత్సరంలోనే ఈ 500 కోచ్‌లు ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది.

ఇవీ కూడా చదవండి

SBI Special FD Scheme: ఎస్‌బీఐలో ఈ స్కీమ్‌లో చేరేందుకు గడువు పెంపు.. వడ్డీ రేటు 6.2 శాతం

EV Charging Points: హెచ్‌పీసీఎల్‌తో టాటా ప‌వ‌ర్ కీలక ఒప్పందం.. విద్యుత్ వాహనాలకు ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటు

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్