విద్యావ్యవస్థపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి 12 తరగతుల వరకు స్కూల్ ఎడ్యుకేషన్..
Telangana Govt : విద్యావ్యవస్థపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు సమూల మార్పులకు శ్రీకారం చుట్టనుంది.
Telangana Govt : విద్యావ్యవస్థపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు సమూల మార్పులకు శ్రీకారం చుట్టనుంది. కొత్త జాతీయ విద్యా విధానానికి ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ఇక నుంచి 12 తరగతుల వరకు స్కూల్ ఎడ్యుకేషన్ నిర్వహించనుంది. ఇప్పటికే డిగ్రీలో క్లస్టర్ విధానం, కామన్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అమలు చేస్తుంది. పీహెచ్‌డీ ప్రవేశాలకు కూడా కామన్ ఎంట్రెన్స్ విద్యా విధానం ప్రారంభించబోతుంది. జాతీయ విద్యా విధానంలో క్లస్టర్ విద్యా విధానానికి అధికంగా ప్రాధాన్యత ఇవ్వనుంది. ఉన్న వనరులను పూర్తిస్థాయిలో వాడుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
సమీపంలో ఉన్న స్కూల్స్, కాలేజెస్, గ్రౌండ్స్, లైబ్రరీ మౌలిక వసతులను పూర్తిస్థాయిలో వినియోగించడంపై ద్రుష్టి సారించారు. క్లస్టర్ విధానం వల్ల దూర ప్రాంతాలకు వెళ్లి చదివే విద్యార్థులు సమీపంలో ఉన్న విద్యా సంస్థల్లో చదువుకునే వెసులుబాటు దొరుకుతుంది. క్లస్టర్స్ విధానంపై ఉన్నత విద్యా మండలి ఇప్పటికే యూనివర్సిటీ వీసీలతో చర్చించింది. క్లస్టర్స్ విధానంపై ఉన్నత విద్యా మండలి ఓ కమిటీ వేసింది. ఈ కమిటీ మూడు విధాలుగా ప్రణాళికలు రచించింది. యూనివర్సిటీ టు యూనివర్సిటీ, అటానమస్ కాలేజెస్ టు అటానమస్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ మూడు స్థాయిల గా క్లస్టర్ విధానాలను నిర్ధారించింది.
దేశంలో నాణ్యమైన పరిశోధనల కోసం నైపుణ్య స్థాయిలను పరిశీలించే విధంగా ప్రత్యేక ప్రణాళికలు ఏర్పాటుచేయనున్నారు. ఇకనుంచి యూజీసీ PhD అడ్మిషన్లకు జాతీయ స్థాయిలో ఓకే ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. స్టాండ్ ఎలోన్ యూనివర్సిటీస్ కాకుండా మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీస్ గా ప్రణాళిక రచిస్తుంది. కొత్త జాతీయ విద్యా విధానం పై ఇప్పటికే డ్రాఫ్ట్ బిల్ రూపొందించింది. పార్లమెంట్ సమావేశాల తర్వాత ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. నూతన విద్యా విధానానికి అనుగుణంగా తెలంగాణ సర్కార్ డ్రాఫ్ట్ సిద్ధం చేసింది. జాతీయ ఆదాయంలో 6 శాతం విద్యారంగానికి ఖర్చు పెట్టాలనీ ఎక్స్పర్ట్స్ కమిటీ నిర్ణయించింది.