పిల్లలను లైంగికంగా వేధించే షెఫ్ గోవాలో అరెస్ట్.. ఇంటర్ పోల్ సమాచారంతో పట్టుకున్న సీబీఐ అధికారులు..

పిల్లలను లైంగికంగా వేధించే ఓ షెఫ్ (వంటమనిషి) ని గోవాలో సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఈ విధమైన నేరాలపై దర్యాప్తు జరుపుతుండగా ఇతడు పట్టుబడినట్టు వారు తెలిపారు.

  • Updated On - 4:44 pm, Wed, 21 July 21 Edited By: Phani CH
పిల్లలను లైంగికంగా వేధించే షెఫ్ గోవాలో అరెస్ట్.. ఇంటర్ పోల్ సమాచారంతో పట్టుకున్న సీబీఐ అధికారులు..
Child Pornography

పిల్లలను లైంగికంగా వేధించే ఓ షెఫ్ (వంటమనిషి) ని గోవాలో సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఈ విధమైన నేరాలపై దర్యాప్తు జరుపుతుండగా ఇతడు పట్టుబడినట్టు వారు తెలిపారు. దేశం బయట ఈ విధమైన పోర్న్ సైట్స్ (చైల్డ్ పోర్నోగ్రఫీ) తో లింక్ పెట్టుకునేందుకు ఈ షెఫ్ ఎలక్ట్రానిక్ మెయిల్ ని వినియోగిస్తున్నాడని, ఇతని నుంచి ల్యాప్ టాప్, కెమెరా తదితర సాధనాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు చెప్పారు. అశ్లీలకర కంటెంట్ ను స్టోర్ చేయడానికి నిందితుడు వివిధ మార్గాలను అనుసరించేవాడనివిదేశాల్లోని పోర్న్ సైట్స్ లో గల సమాచారాన్ని ఫోటో షేరింగ్ ద్వారా సేకరించి దాన్ని వాట్సాప్, ఇన్స్ టాగ్రామ్ వంటివాటి ద్వారా దేశంతో బాటు విదేశియులతో కూడా షేర్ చేస్తూ వచ్చాడన్నారు. సుమారు 25 నుంచి 30 మంది పిల్లలను ఈ షెఫ్ లైంగికంగా వేధించినట్టు తెలియవచ్చిందన్నారు. చైల్డ్ పోర్నోగ్రఫీలో కొందరు నిందితులు ఇండియాలో ఇలా చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ఇంటర్ పోల్ నుంచి అందిన సమాచారం ఆధారంగా ఇతడిని సీబీఐ అరెస్టు చేసింది.

జూన్ 22 నే కేసు నమోదు చేసినప్పటికీ..రహస్యంగా వల పన్ని నిన్న అరెస్టు చేశారు. ఇతడిని కూలంకషంగా విచారిస్తున్నారు. ఇక యూపీ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖలో పని చేసే జూనియర్ ఇంజనీర్ ని కూడా సీబీఐ గత నవంబరులో అరెస్టు చేసింది. ఆ నిందితుడు పదేళ్లుగా పిల్లల పట్ల ఈ విధమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవాడని, సుమారు 50 మంది పిల్లలు ఇతని బాధితులని తెలిసిందని అధికారులు వెల్లడించారు. కొందరిని ఈ జూనియర్ ఇంజనీర్ బ్లాక్ మెయిల్ కూడా చేసేవాడట. ఇతనిపై కూడా రహస్యంగా దర్యాప్తు జరిపి అరెస్టు చేసి..పోక్సో కోర్టులో హాజరుపరిచారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Ananya Kumari: కేరళ ఎన్నికల్లో పోటీ చేయబోయిన తొలి ట్రాన్స్ జెండర్ అనన్య కుమారి అనుమానాస్పద మృతి.. వేధింపులే కారణమా..??

Andhrapradesh: ఏపీలోని ఆ ప్రాంత ప్రజలకు అలెర్ట్.. వారం రోజులపాటు కర్ఫ్యూ విధింపు