First Theater: దేశంలో మొదటి థియేటర్ ప్రారంభం అయి ఇప్పటికి 138 ఏళ్ళు..ఇది ఇప్పటికీ నడుస్తోంది.. ఎక్కడంటే..

First Theater: సినిమా ఇప్పుడు అందరికీ అతిపెద్ద వినోద సాధనం.  థియేటర్లు.. టీవీ.. ఓటీటీ.. ఇలా ఎటువంటి వేదిక మీద ప్రదర్శించినా సినిమా క్రేజ్ మామూలుగా ఉండదు.

First Theater: దేశంలో మొదటి థియేటర్ ప్రారంభం అయి ఇప్పటికి 138 ఏళ్ళు..ఇది ఇప్పటికీ నడుస్తోంది.. ఎక్కడంటే..
First Theater
KVD Varma

|

Jul 21, 2021 | 4:17 PM

First Theater: సినిమా ఇప్పుడు అందరికీ అతిపెద్ద వినోద సాధనం.  థియేటర్లు.. టీవీ.. ఓటీటీ.. ఇలా ఎటువంటి వేదిక మీద ప్రదర్శించినా సినిమా క్రేజ్ మామూలుగా ఉండదు. మన జనాళికి వినోదం అంటే సినిమా ఒక్కటే ముందు గుర్తువచ్చేది. సినిమా వెండి తెర మీద చూస్తేనే ఫుల్ మజా. ఎంత ఫ్రీగా సినిమాని టీవీలో చూపించినా.. థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తే ఆ కిక్కే వేరు. ఇప్పుడు సినిమా థియేటర్లు పూర్తి ఆధునికత తో మెరిసిపోతున్నాయి. కానీ, సినిమా కంటే పూర్వం వినోదం అంటే నాటకం. వీధుల్లో.. నాలుగు రోడ్ల కూడళ్లలో.. ఊర్లలోని దేవాలయాలు.. ఇలా ఎక్కడ పడితే అక్కడ నాటకాలు వేస్తుండేవారు. నాటకాలు వేయడానికి ప్రత్యేకంగా వేదిక ఉండేది కాదు. కానీ, ఈ రోజుకు సరిగ్గా 138 సంవత్సరాల క్రితం ఒక ప్రత్యేకమైన థియేటర్ నాటకాల కోసం ప్రారంభించారు. దేశంలో తొలి థియేటర్ ఇదే. మొదట్లో ఈ థియేటర్ లో నాటకాలు ప్రదర్శించినా.. తరువాత ఇక్కడ సినిమాల ప్రదర్శన కూడా కొనసాగింది. దేశంలోని తొలి థియేటర్ గురించి కొన్ని వివరాలు.

సరిగ్గా ఈరోజున (జూలై, 21) 1883 లో కోల్‌కతాలోని స్టార్ థియేటర్ ప్రారంభం అయింది.  దీనిని భారతదేశంలో మొట్టమొదటి పబ్లిక్ థియేటర్‌గా చెబుతారు.  21 జూలై 1883 న, ఈ థియేటర్‌లో ‘దక్షి యజ్ఞ’ అనే నాటకం ప్రదర్శించారు. ఈ నాటకాన్ని గిరీష్ చంద్ర ఘోష్ రాశారు. అదేవిధంగా ఆయన అందులో ప్రధాన పాత్రను పోషించారు.  ఈ థియేటర్‌ను గిరీష్ చంద్ర ఘోష్, బినోదిని దాసి, అమృత్‌లాల్ బసు సంయుక్తంగా ప్రారంభించారు. ముందు ఈ థియేటర్‌కు బినోదిని దాసి పేరు పెట్టాలని అనుకున్నారని, అయితే ఆ సమయంలో నటన మహిళలకు మంచి వృత్తిగా పరిగణించలేదు. అందువల్ల థియేటర్ పేరును స్టార్‌గా పిలిచారు.  థియేటర్ ప్రారంభించడానికి అవసరమైన డబ్బును గురుముఖ్ రాయ్ ఇచ్చారు. అయితే, తరువాత కొన్ని కారణాల వల్ల గుర్ముఖ్ రాయ్ థియేటర్‌ను 11 వేల రూపాయలకు అమ్మారు. 1883 నుండి 1887 వరకు మొత్తం 20 నాటకాలు థియేటర్‌లో ప్రదర్శించారు.

1888 లో, థియేటర్ ప్రస్తుత బిధన్ శరణికి మార్చారు. ఈ థియేటర్ చాలా మంది ప్రముఖులకు తన వేదికను ఇచ్చింది. వీటిలో అమృత్‌లాల్ మిత్రా, అమృత ముఖర్జీ, సర్జు దేవి, శిశిర్ కుమార్ భదురి, సౌమిత్రా ఛటర్జీ, ఉత్తమ్ కుమార్, గీతా డే వంటి పేర్లు ఉన్నాయి.

1898 లో, స్వామి వివేకానంద ఈ థియేటర్‌లో మార్గరెట్ నోబెల్ (సిస్టర్ నివేదా) ను పరిచయం చేయడానికి బహిరంగ సభను ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా థియేటర్ హాల్‌లో ప్రేక్షకులలో రామకృష్ణ పరమహంస, రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా హాజరయ్యారు. భారతదేశంలో సినిమాలు ప్రారంభమైనప్పుడు, హిరలాల్ సేన్ సినిమాని కూడా ఈ థియేటర్‌లో ప్రదర్శించారు.

మన్మత్ రాయ్ నాటకం ‘జైలు’ 1931 లో ఈ థియేటర్‌లో ప్రదర్శితమైంది. ఈ థియేటర్‌లో ఇదే చివరి నాటక ప్రదర్శన. నాటకాలకు ఆదరణ తగ్గిపోవడంతో క్రమేపీ ఇక్కడ సినిమాల ప్రదర్శన ప్రారంభం అయింది.  ప్రస్తుతం దీనిని సినిమా హాల్‌గా మార్చారు. కొన్నిసార్లు ఇప్పటికీ ఇక్కడ నాటకాలు కూడా ప్రదర్శిస్తూ ఉంటారు.

Also Read: Employment : కరోనా దెబ్బకు కుదేలవుతున్న కొలువులు..షాకింగ్ విషయాలు వెల్లడించిన EPF గణాంకాలు 

‘మినీ మూవింగ్ హౌస్’ గా మారిన ఆటో.. అన్నీ ఉన్నా ఆ డ్రైవర్ లైఫ్ లో వెలితి.. ఏమిటంటే ?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu