Trending Video: ప్రతికారం ఇలా కూడా తీర్చుకుంటారా.. దాడి చేస్తే స్వారీ చేస్తారా.. వామ్మో.. ఇది మాములుగా లేదుగా..

ఈ రోజుల్లో ఒక స్క్విరెల్, పిల్లి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిలో పిల్లికి ఉడుత స్వారీ చేయడం..మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత నవ్వును ఆపుకోలేరు.

Trending Video: ప్రతికారం ఇలా కూడా తీర్చుకుంటారా.. దాడి చేస్తే స్వారీ చేస్తారా.. వామ్మో.. ఇది మాములుగా లేదుగా..
Squriel And Cat
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 21, 2021 | 4:47 PM

ఈ మధ్య సోషల్ మీడియాలో జంతువుల వీడియోలు వైరల్ అవుతున్నాయి. సమయం దొరికితే చాలా అంతా ఇలాంటి వీడియోలను తెగ పోస్ట్ చేస్తున్నారు. అంతే కాదు షేర్ చేస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు వారి వరకు  అవి చేసే సందడిని చూసి ముచ్చట పడుతున్నారు. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోలో ఓ పిల్లి ముందు ఒక ఉడుత రావడాన్ని మీరు వీడియోలో చూడవచ్చు. ఆ తరువాత పిల్లి దానిపై దాడి చేస్తుంది. అది చేసిన దాడికి స్క్విరెల్ ప్రతికారం తీర్చుకుంటుంది. అదును చూసి దాని నోటిపైకి ఎక్కుతుంది. దీనివల్ల పిల్లి ఏమీ చూడదు. ఆ తరువాత ఉడుత తెలివిగా పిల్లి వీపుపైకి ఎక్కి స్వారీ ప్రారంభిస్తుంది. ఆ ఫన్నీ వీడియోను ఇక్కడ చూడండి…

గుర్రం స్వారీ చేయడం ఓ సరదా.. అది ఓ రాజసం.. అయితే అందరికీ హార్స్ రైడింగ్ చేయాలని ఉంటుంది. అది గుర్రంపైనే అయితే ఏం స్పెషల్ ఉంటుందని అనుకుందో ఏమో పిల్లిపై స్వారీ చేద్దామని డిసైడ్ అయ్యింది ఓ బుజ్జి ఉడుత. అంతే అనుకున్నదే తడువుగా పిల్లిపైకి దూకేసింది. అది కాదు.. కూడదూ అన్నా… తన లక్ష్యం నెరవేర్చుకుంది. పిల్లిపైకి దూకేసింది.  అటువంటి పరిస్థితిలో, పిల్లికి ఉడుతను ఎలా పట్టుకోవాలో అర్థం కాలేదు.

సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసిన జనం భారీగా లైక్స్ చేస్తున్నారు. అంతే కాదు చాలా మంది నెటిజన్లు ఈ వీడియోపై కామెంట్స్ చేస్తున్నారు. మనం ఎవ్వరినీ చిన్నచూపు చూడొద్దని చెప్పుకొస్తున్నారు. అదే సమయంలో మరొకరు దీనిని ‘విక్టరీ ఓవర్ వీయర్’ అని పిలుస్తారు అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియోను రకరకాలుగా ప్రశంసించారు.

ఇవి కూడా చదవండి:  Viral News: ఆకాశం నుంచి ఆశ్చర్యకర రీతిలో వచ్చిన మృత్యు పాశం… ఓ వ్యక్తిని బలితీసుకున్న నెమలి..

American Gold Car: ఇది చూసి నేర్చుకోండి.. డబ్బులెలా ఖర్చుపెట్టొద్దో.. నెటిజన్లకు పాఠం నేర్పించిన బిజినెస్‌ టైకూన్‌ ఆనంద్ మహీంద్ర

Valuable Wood: ఎర్రచందనంను మించిన ధర.. ప్రంపచంలోనే అత్యంత ఖరీదైన కలప ఇదే..