American Gold Car: ఇది చూసి నేర్చుకోండి.. డబ్బులెలా ఖర్చుపెట్టొద్దో.. నెటిజన్లకు పాఠం నేర్పించిన బిజినెస్‌ టైకూన్‌ ఆనంద్ మహీంద్ర

ఆయన చేసిన ఓ ట్వీట్ ప్రజలకు పాఠం నేర్పించారు. డబ్బు ఉంటే ఏదైనా చేయవచ్చు.. అంతే కానీ ఇలా కాదు అంటూ ట్వీట్ చేశారు.

American Gold Car: ఇది చూసి నేర్చుకోండి.. డబ్బులెలా ఖర్చుపెట్టొద్దో.. నెటిజన్లకు పాఠం నేర్పించిన బిజినెస్‌ టైకూన్‌ ఆనంద్ మహీంద్ర
American Gold Car
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 21, 2021 | 3:00 PM

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అతికొద్ది మంది వ్యాపార వేత్తల్లో ఆనంద్‌ మహీంద్ర ఒకరు. లక్షల సంఖ్యలో ఉద్యోగులు, రూ. కోట్ల టర్నోవర్‌ కంపెనీని నడిపించడం, వీటన్నింటి మధ్యలో కూడా నెటింట్లో సందడి చేస్తుంటాడీ వ్యాపార దిగ్గజం. కేవలం సరదగా ట్వీట్లు చేయడమే కాకుండా అప్పుడప్పుడు సమాజానికి అవసరమయ్యే విలువలను గుర్తు చేసే పోస్ట్‌లు, సూచనలు సైతం చేస్తుంటారు ఆనంద్‌ మహీంద్ర. ఈ క్రమంలోనే తాజాగా ఈ బిజినెస్‌ టైకూన్‌ చేసిన తాజాగా ట్వీట్ ప్రజలకు ఓ పాఠం నేర్పించారు. డబ్బు ఉంటే ఏదైనా చేయవచ్చు.. అంతే కానీ ఇలా కాదు అంటూ ట్వీట్ చేశారు. డబ్బులు వృథాగా ఎలా ఖర్చు చేయకూడదో ఆయనను చూసి నేర్చుకోండి అంటూ.. ఓ వీడియోను పోస్ట్ చేసి  చూపించారు.

ఆ వీడియోలో.. అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి తన ఫెరారీ కారేసుకొని వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏమిటని ఆరా తీస్తే.. అది పూర్తిగా బంగారు పూత పూసిన కారని వీడియో ద్వారా తెలుస్తోంది. ఓ ఇద్దరు వ్యక్తులు దాంట్లో కూర్చుని వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. దాన్ని చూసి చుట్టుపక్కల వారంతా ఆశ్యర్యపోతూ ఫొటోలు తీసుకుంటున్నారు. ఈ వీడియోపైన ‘ఇండియన్‌ అమెరికన్ విత్‌ ప్యూర్‌ గోల్డ్‌ ఫెరారీ కార్‌’ అని నోట్‌ రాసి ఉంది.

దీనిపై ఆనంద్‌ మహీంద్రా తన ట్విటర్‌ ఖాతాలో అసంతృప్తి వ్యక్తం చేశారు. డబ్బులు ఎలా ఖర్చు పెట్టకూడదో ఈ వీడియో చూసి నేర్చుకోవాలి అంటూ కామెంట్ జోడించారు. ‘‘ఇది సామాజిక మాధ్యమాల్లో ఎందుకు చక్కర్లు కొడుతుందో నాకర్థం కావడం లేదు. మనం ధనవంతులమైనంత మాత్రాన డబ్బులు ఎలా ఖర్చు పెట్టకూడదో దీని ద్వారా మనం పాఠం నేర్చుకోవచ్చు. అందుకు తప్ప.. ఇంకా ఏ విషయంలో ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిందో?’’ అని ఆయన ట్విటర్‌లో కామెంట్ చేశారు. ఇది చూసిన జనం ఆనంద్‌ మహీంద్రకు మద్దతుగా నిలిచారు.

ఇవి కూడా చదవండి: Viral Pic: ఈ ఫోటోలోని చిన్నది ఇప్పుడొక క్రేజీ హీరోయిన్.. ఫ్యాన్స్‌‌ ముద్దుగా ఏమని పిలుస్తారో తెలుసా.!

బక్రీద్ పండుగ వేళ..లక్షలు పలికిన రెండు మేకలు..మరి.. వాటి రోజువారీ ఖర్చు మాటో ..? తెలుసుకోవలసిందే !