Gas Cylinder: బంపర్ ఆఫర్.. గ్యాస్ సిలిండర్‌ను ఇలా బుక్ చేసుకోండి.. రూ. 900 క్యాష్ బ్యాక్ పొందండి
Gas Cylinder: గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకోవడానికి ప్రజలు బయటకు వెళ్లి క్యూలలో నిలబడవలసిన రోజులు పోయాయి.
Gas Cylinder: గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకోవడానికి ప్రజలు బయటకు వెళ్లి క్యూలలో నిలబడవలసిన రోజులు పోయాయి. సాంకేతి పరిజ్ఞానం పెరగడంతో.. ఇంట్లోనే కూర్చుని గ్యాస్ బుకింగ్ చేసుకునే పరిస్థితులు వచ్చాయి. తాజాగా ఇండేన్ గ్యాస్ తన కస్టమర్ల కోసం గ్యాస్ బుకింగ్ సేవను మరింత సులభతరం చేసింది. పేటీఎం ద్వారా గ్యాస్ బుకింగ్‌కు అవకాశం ఇస్తోంది. అంతేకాదు.. ఇండేన్ గ్యాస్ బుక్ చేసుకునే వారికి పేటీఎం బంపర్ ఆఫర్ అందిస్తోంది. పేటీఎం ద్వారా ఇండేన్ ఎల్‌పీజీ సిలిండర్ బుక్ చేసుకునే కస్టమర్లకు రూ. 900 క్యాష్ బ్యాక్ ఆఫర్ కల్పిస్తోంది. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ షేర్ చేసింది. ‘‘మీ ఇండేన్ గ్యాస్ ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్‌ను పేటీఎంలో బుక్ చేసుకోండి.. రూ. 900 క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను పొందండి. గ్యాస్ బుకింగ్ http://bit.ly/3xooDLV ఈ లింక్ ద్వారా చేసుకోండి’’ అని ఆ ట్వీట్‌లో పేర్కొంది.
ఇండేన్ గ్యాస్ ఎల్‌పిజి సిలిండర్‌ను ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇండేన్ గ్యాస్ సిలిండర్ కస్టమర్లు ముందుగా పేటీఎం కు లాగిన్ అవ్వాలి. తద్వారా ఇంట్లో, ఆఫీస్‌లో ఎక్కడ ఉన్నా గ్యాస్ బుక్ చేసుకోవచ్చు.
1: Paytm లో ఇండేన్ గ్యాస్ బుకింగ్ పేజీకి వెళ్ళండి. 2: మీ వినియోగదారు సంఖ్య లేదా మొబైల్ నంబర్ లేదా ఎల్‌పీజీ ఐడిని నమోదు చేయండి. 3: మీ గ్యాస్ ఏజెన్సీని ఎంచుకోండి. 4: ప్రొసీడ్ పై క్లిక్ చేయండి. 5: డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యుపిఐ నుండి చెల్లింపు మోడ్‌ను ఎంచుకోండి (యుపిఐ పేటిఎం యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది). 6: పే ఆప్షన్‌పై క్లిక్ చేసి పేమెంట్‌ను కంప్లీట్ చేయాలి.
Indane Tweet:
Get up to ₹900 cashback while booking your #Indane LPG refill on @paytm. Book now: https://t.co/4xn4H7f2gj. Terms & Conditions Apply. #LPGBooking pic.twitter.com/9yoKRH04eR
— Indian Oil Corp Ltd (@IndianOilcl) July 18, 2021
Also read:
Lose Weight Fast: పాలతో వేగంగా బరువు తగ్గొచ్చు.. అదెలాగంటే.. ఆసక్తికర విషయాలు మీకోసం..