- Telugu News పొలిటికల్ ఫొటోలు Centre government sticks to the same decision of privatisation of visakhapatnam steel plant
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై వెనక్కి తగ్గేది లేదు.. స్పష్టం చేసిన కేంద్రం.. అమీ తుమీ తేల్చుకుంటామంటున్న ఏపీ ఎంపీలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. నిన్న పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో నిరసన మంటలు భగ్గుమన్నాయి.
Updated on: Jul 21, 2021 | 2:22 PM

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం నిర్ణయాన్ని నిన్న రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల ప్రశ్నించారు. దీంతో కేంద్ర మంత్రి భగవత్ కిషన్ రావు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై మరో ఆలోచనకు తావులేదన్నారు. నూటికి నూరుశాతం ప్రైవేటీకరణ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.ప్రైవేటీకరణపై తుది నిర్ణయానికి వచ్చేశాక.. ఇకపై చెప్పేదేమీ లేదని కేంద్రం వైఖరిని కుండబద్దలు కొట్టారు. అయితే ఉక్కు పరిశ్రమ ఉద్యోగులు, వాటాదారుల చట్టబద్ధమైన అంశాలను పరిష్కరిస్తామన్నారు భగవత్ కిషన్ రావు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. నిన్న పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో నిరసన మంటలు భగ్గుమన్నాయి. 100 శాతం పెట్టుబడుల ఉపసంహరణ తప్పదన్న ప్రకటనను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. 160 రోజులుగా ఆందోళన చేస్తున్నామని.. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఎంత వరకైనా వెళ్తామంటున్నారు.

కేంద్రం ఇప్పటికైనా ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటున్నారు. లేదంటే ఆందోళనను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో ఏపీలో నిరసనలు మరింత ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఈ నిరసనల్లో అన్ని పార్టీ నేతలు పాల్గొంటున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు. అటు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కూడా ఈ ధర్నాల్లో పాల్గొంటున్నారు.

కేంద్రం ఇప్పటికైనా ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటున్నారు. లేదంటే ఆందోళనను మరింత ఉదృతం చేస్తామని ఎంపీ కనకమేడల హెచ్చరిస్తున్నారు.

ఏపీలో నిరసనలు మరింత ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఈ నిరసనల్లో అన్ని పార్టీ నేతలు పాల్గొంటున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు. అటు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కూడా ఈ ధర్నాల్లో పాల్గొంటున్నారు.

Vizag Steel
