Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పెళ్లి వేదికపై వరుడికి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన వధువు.. షాక్‌తో నోరు మూసుకున్న వరుడు..!

Viral Video: ప్రతి జంట తమ పెళ్లిని సమ్‌థింగ్ స్పెషల్‌గా నిర్వహించుకోవాలని కోరుకుంటారు. అలాగే వారు కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా..

Viral Video: పెళ్లి వేదికపై వరుడికి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన వధువు.. షాక్‌తో నోరు మూసుకున్న వరుడు..!
New Married
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 21, 2021 | 2:20 PM

Viral Video: ప్రతి జంట తమ పెళ్లిని సమ్‌థింగ్ స్పెషల్‌గా నిర్వహించుకోవాలని కోరుకుంటారు. అలాగే వారు కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవాలని ఆశిస్తారు. ఇందులో భాగంగానే.. ఈ వధువు వివాహ వేడుక ప్రారంభమయ్యే ముందు వరుడిని ఆశ్చర్యపరచాలని నిర్ణయించుకుంది. ఆఖరికి అనుకున్నది సాధించింది. వధువును చూసి వరుడు మంత్రుముగ్ధుడు అయిపోయాడు. వధవును చూడటానికి ఆ వరుడికి రెండు కళ్లు చాలలేదంటే నమ్మొచ్చు. వధువుని చూసిన ఆ వరుడి కళ్లల్లో ఆనందం కొట్టొచ్చినట్లు కనిపించింది. అంతేకాదు.. ఆమె ఇచ్చిన ఎంట్రీకి ఫిదా అయిపోయాడు. నోటిపై చేయి పెట్టుకుని సంభ్రమాశ్చర్యానికి గురయ్యాడు. వీరి వివాహానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అసలు ఈ వీడియోలో ఏముందంటే.. నూతన జంట వివాహ వేడుక జరుగుతోంది. వరుడు వివాహ వేదికపై బంధుమిత్రులతో కలిసి ఉన్నాడు. వరుడు సహా అందరూ వధువు రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఫంక్షన్ హాల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వధువును కొంతమంది పరదాలు అడ్డుపెట్టి కవర్ చేశారు. ఒక్కో పరదా తొలగిస్తూ చివరకు వధువు అడ్డుగా ఉన్న పరదాగా తొలగించారు. అలా అన్ని పరదాలు తొలగిపోగా.. ఆ నవ వధువు అందమైన లెహంగాలో దేవ కన్యలా దర్శనమిచ్చింది. చిరు నవ్వులు చిందిస్తూ వరుడి వైపు చూసింది. అయితే, అటువైపు వధువు ఎంట్రీని చూసిన వరుడు ఫిదా అయిపోయాడు. దేవ కన్యాల మెరిసిపోతున్న ఆ నవ వధువును చూసి వరుడు మొదట షాక్ అయ్యాడు. ఆ తరువాత మురిసిపోతూ నవ్వులు చిందించాడు. మరోవైపు బంధు, మిత్రుల కోలాహలంతో పెళ్లి వేడుక సందడిగా మారింది. ఈ అద్భుతమైన సన్నివేశానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రమ్‌లో “theweddingbrigade” ఖాతాలో షేర్ చేశారు. ఇప్పటి వరకు 2 లక్షల మందికి పైగా నెటిజన్లు వీక్షించగా.. 40 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ బ్యూటీఫుల్ వీడియోను మీరూ చూసేయండి మరి.

Viral Video:

Also read:

Virata Parvam : ప్రముఖ ఓటీటీ చేతికి రానా విరాటపర్వం అంటూ టాక్.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

సినీప్రియులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. ఈ నెల 30 నుంచి థియేటర్స్ ఓపెన్

Petrol Prices: వాహనదారులకు గుడ్ న్యూస్.. దేశంలో తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.! వివరాలివే..