బక్రీద్ పండుగ వేళ..లక్షలు పలికిన రెండు మేకలు..మరి.. వాటి రోజువారీ ఖర్చు మాటో ..? తెలుసుకోవలసిందే !

బక్రీద్ సందర్భంగా ముస్లిములంతా ఉత్సాహంగా ఈ ఈద్ జరుపుకొంటున్నారు. ఒకరికొకరు శుభా కాంక్షలు చెప్పుకుంటున్నారు. మేకలు, గొర్రెల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఇక యూపీ రాజధాని లక్నోకు వెళ్తే అక్కడ చూడ ముచ్చటైన రెండు మేకలు మాత్రం అందర్నీ ఆకర్షిస్తున్నాయి.

  • Publish Date - 1:16 pm, Wed, 21 July 21 Edited By: Anil kumar poka
బక్రీద్ పండుగ వేళ..లక్షలు పలికిన రెండు మేకలు..మరి.. వాటి రోజువారీ ఖర్చు మాటో ..? తెలుసుకోవలసిందే !
Bakrid In Lucknow Pair Of Goats Sold For Rs.4.5 Lakhs Daily Cost For Food Rs

బక్రీద్ సందర్భంగా ముస్లిములంతా ఉత్సాహంగా ఈ ఈద్ జరుపుకొంటున్నారు. ఒకరికొకరు శుభా కాంక్షలు చెప్పుకుంటున్నారు. మేకలు, గొర్రెల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఇక యూపీ రాజధాని లక్నోకు వెళ్తే అక్కడ చూడ ముచ్చటైన రెండు మేకలు మాత్రం అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ఇవి ఇతర మేకల కన్నా అత్యధిక ధరకు అమ్ముడుపోయాయంటే ఆశ్చర్యపడక తప్పదు. వీటిని ఓ వ్యక్తి. రూ. 4.5 లక్షలు పెట్టి కొన్నాడు.. గోమతి నది దగ్గర ఓ మేకల మార్కెట్ లో అమ్మకానికి ఉంచిన ఇవి ఇంత ధర పలికాయి. అయితే వీటిలో చాలా విశేషాలే ఉన్నాయి. ఓ మేక బరువు 170 కేజీలు కాగా..మరో దాని బరువు 150 కేజీలు.. రెండేళ్ల వయసున్న వీటికి ప్రతి రోజూ పిస్తా, బాదంపప్పు, జీడిపప్పు, ఆల్మండ్స్, స్వీట్స్ వగైరా తినిపిస్తారట. అలాగే జ్యుసులు కూడా తాగిస్తారట.. అంటే రోజుకు వీటికి దాదాపు 600 రూపాయల వరకు ఖర్చు చేస్తామని అమ్మకందారులు తెలిపారు. ఇంతేకాదు.. ఇవి ఆరోగ్యాంగా ఉండడానికి రోజా స్నానం కూడా చేయిస్తామని వారు చెప్పారు.ఇది చూస్తే సంక్రాంతి పండుగకు ముందు ప్రజలు పందెం కోళ్లకు ఖరీదైన ఆహారం తినిపించే రోజులు గుర్తుకొస్తున్నాయని అంటున్నారు. ఆరోగ్యంగా ఉండే ఈ పందెం కోళ్లు కూడా లక్షల్లో ధర పలుకుతాయి.

ఇక ఇలాంటి పండుగలు, పబ్బాలు వచ్చినప్పుడు కూడా అంతా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కేంద్రం హెచ్చరిస్తున్నా వాటిని ఎవరూ సరిగా పాటించడం లేదు. అనేక మార్కెట్లలో జనం గుంపులు గుంపులుగా ఈ నిబంధనలను పాటించకుండానే వ్యవహరిస్తున్నారు. దేశంలో.. ముఖ్యంగా మహారాష్ట్రలో అప్పుడే కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా ఇలాగే పెరుగుతోంది.

మరిన్ని ఇక్కడ చూడండి : News Watch : బె ‘జోష్’…అంతరిక్షయాత్ర దిగ్విజయం..మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )

 కరోనాతో పాటే ‘నోరో వైరస్’.. కళవరపెడుతున్న కొత్త టెన్షన్…ఇప్పటికే నమోదైన పలు కేసులు..:Norovirus Tension Live Video.

 ఉదయం ఉమ్మిని రాసుకుంటా..అందుకే అందంగా ఉన్నా..బ్యూటీ సీక్రెట్ చెప్పేసిన మిల్కి తమన్నా..:Tamannaah Beauty Video.

 తండ్రిని…ఏం కాక పడుతుంది ఛార్మి !ఎందుకు అనుకుంటున్నారా..?చివరికి ఎం అయ్యింది..:Charmy Kaur Video.