Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valuable Wood: ఎర్రచందనంను మించిన ధర.. ప్రంపచంలోనే అత్యంత ఖరీదైన కలప ఇదే..

world most expensive wood: ఖరీదైన కలప అంటే మనకు టక్కున గుర్తుకు వచ్చేది ఎర్రచందనం.. గంధపు చెక్క... అంతే కానీ అంతకు మించిన విలువైన కలప ప్రపంచంలో చాలా ఉన్నాయి. అదేంటో తెలుసుకుందామా..

Valuable Wood: ఎర్రచందనంను మించిన ధర.. ప్రంపచంలోనే అత్యంత ఖరీదైన కలప ఇదే..
African Blackwood
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 21, 2021 | 3:45 PM

ఖరీదైన కలప అంటే మనకు టక్కున గుర్తుకు వచ్చేది ఎర్రచందనం.. గంధపు చెక్క.. చందనం. అంతే కానీ అంతకు మించిన విలువైన కలప ప్రపంచంలో చాలా ఉన్నాయి. అదేంటో తెలుసుకుందామా.. కొన్ని రకాల కలపలు చాలా ఖరీదైనవి.. కొన్ని చాలా అరుదుగా ఉంటాయి. వీటిలో గంధపు చెక్క దీని విలువ దీనిదే.. కానీ.. అత్యంత ఖరీదైనది మాత్రం కాదు. కాని ఈ రోజు మనం ప్రపంచంలో అలాంటి కలప గురించి మీకు చెప్పబోతున్నాం. ఇది గంధపు చెక్క ధర కంటే ఎక్కువ. దీని ఖరీదు చాలా రెట్లు ఎక్కువ. అంతే కాదు బంగారంతో సమానంగా ఉంటుంది.

వాటి విలువ ఎంతో తెలిస్తే నమ్మడం కష్టం అవుతుంది. గంధపు చెక్కను ఖరీదైనదిగా భావిస్తున్నప్పటికీ దీని ధర కిలోకు ఐదు నుండి ఆరు వేల రూపాయలు వరకు ఉంటుంది. అయితే ప్రపంచంలో ఇలాంటి కలప ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది గంధపు చెక్క ధర కంటే చాలా రెట్లు ఎక్కువ. అతిపెద్ద ధనవంతులు కూడా కొనడానికి ఖచ్చితంగా 10 సార్లు ఆలోచిస్తారు..

బంగారంతో సమానం..

మనం ఇక్కడ చెప్పుకుంటున్నది అంత విలువైన కలప గురించి. కలప పేరు ఆఫ్రికన్ బ్లాక్ ఉడు. ఈ కలప భూమిపై అత్యంత విలువైన వాటిలో ఇంది కూడా ఒకటిగా పరిగణించబడుతుంది. మనం దాని ధర గురించి మాట్లాడితే.. ఈ కలప ధరతో మనం చాలా మంచి లగ్జరీ కారును సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఇది సరిగ్గా కిలో బంగారంతో సమానం. అప్పుడు ఒక కిలో ధర 8 వేల పౌండ్ల కంటే ఎక్కువ.. అంటే 7 లక్షల రూపాయలు. 

 ఇది చాలా అరుదు మొక్క

ఆఫ్రికన్ బ్లాక్‌వుడ్ చెట్లు ఆఫ్రికాలోని పొడి ప్రాంతాలలో సెనెగల్ తూర్పు నుండి ఎరిట్రియా  దక్షిణాఫ్రికాలోని ఈశాన్య భాగాలలో కనిపిస్తాయి. వాటి ఎత్తు 25-40 అడుగులు. ఇవి ఎక్కువగా పొడి ప్రదేశాల్లో మాత్రమే కనిపిస్తాయి. ఆఫ్రికన్ బ్లాక్‌వుడ్‌ చెట్టు మనకు సరిగ్గా సిద్ధం కావాలంటే 60 సంవత్సరాలు పడుతుంది. అయితే ఈ చెట్లు రోజు రోజుకు అంతరించి పోతున్నాయి. వీటిని దేశ సరిహద్దులు దాటిస్తుంటారు. ప్రభుత్వం చెప్పే లెక్కల ప్రకారం కెన్యా, టాంజానియా వంటి దేశాలలో ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ కలప అక్రమ రవాణా అవుతోంది.

ఆఫ్రికన్ బ్లాక్‌వుడ్ చెట్ల కలపను ఎక్కువగా క్లారినెట్, వేణువు, గిటార్ వంటి సంగీత వాయిద్యాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.  అంతేకాకుండా, ఈ కలప నుండి బలమైన, మన్నికైన ఫర్నిచర్ కూడా తయారవుతుంది, కానీ అవి చాలా ఖరీదైనవి. చాలా ఖరీదైనది. వాటిని కొనడం సాధారణ ప్రజలతో కాదు అని చెప్పాలి. 

Variety Fish: క్రేజీ ఫిష్.. కొండలు సైతం ఎక్కగలదు.. మరో షాకింగ్ విషయం ఏంటంటే..?