ఆమె దయాగుణం లేని విషకన్య..! అందమే ఆమె ఆయుధం.. వలపు వల విసిరిందంటే విలవిలలాడాల్సిందే..

విషకన్య పేరు మీరు వినే ఉంటారు. కానీ చాలా కొద్ది మందికి మాత్రమే వీరి గురించి తెలుసు. పురాతన కాలంలో విషకన్యల గురించి ప్రస్తావన ఉండేది కానీ ధృవీకరించలేదు. అయినప్పటికీ

ఆమె దయాగుణం లేని విషకన్య..! అందమే ఆమె ఆయుధం.. వలపు వల విసిరిందంటే విలవిలలాడాల్సిందే..
Vishkanya
Follow us

|

Updated on: Jul 21, 2021 | 9:34 PM

విషకన్య పేరు మీరు వినే ఉంటారు. కానీ చాలా కొద్ది మందికి మాత్రమే వీరి గురించి తెలుసు. పురాతన కాలంలో విషకన్యల గురించి ప్రస్తావన ఉండేది కానీ ధృవీకరించలేదు. అయినప్పటికీ చరిత్రలో వీరి గురించి ప్రస్తావించారు. ఆచార్య చాణక్య రాసిన అర్థశాస్త్రంలో విషకన్య గురించి చెప్పారు. పురాతన కాలంలో రాజులు విషకన్యలను పెంచి పోషించేవారు. వీరి ప్రధాన విధి రాజుల ప్రధాన శత్రువులను అంతం చేయడం. అందుకోసం వారికి అద్భుతమైన శిక్షణ ఇచ్చేవారు. విషకన్యలను హ్యూమన్ వెపన్ అని ప్రస్తుత భాషలో అర్థం చేసుకోవచ్చు. వీరు మంచి యోధులను చంపడానికి అందం ఎరగా వేసేవారు. సులభంగా పని ముగించేవారు.

అందమైన అమ్మాయిలను విషకన్యగా మార్చేవారు.. విషకన్యను తయారు చేయడానికి అందమైన అమ్మాయిలను ఎంపిక చేసేవారు. రాజ్యంలోని పేద, అనాథ బాలికలను విషకన్యలుగా మార్చేవారు. ఒక సాధారణ అమ్మాయిని విషకన్యగా మార్చడానికి చాలా ప్రమాదకరమైన విధానాలను అనుసరించేవారు. ఆమెకు చిన్న వయస్సు నుంచే వివిధ రూపాల్లో విషం ఇచ్చేవారు. కాలక్రమేణా అమ్మాయిలకు పాయిజన్ మొత్తాన్ని పెంచేవారు. ఈ ప్రక్రియ చాలా ప్రమాదకరమైనది. విషకన్య కావడానికి ముందు చాలా మంది బాలికలు చనిపోయేవారు. మరి కొంతమంది వికలాంగులు అయ్యేవారు.

విషకన్యకు అందమే ఆయుధం.. ఒక సాధారణ అమ్మాయిని విషకన్యగా మార్చడానికి ఆమెకు నృత్యం, సంగీతం, సాహిత్యం నేర్పించేవారు. ఆమెను మనోహరంగా ఆకర్షణీయంగా తయారుచేసేవారు. శత్రువు అనుకోకుండా విషకన్య వలలో చిక్కుకుంటే ఇక అంతే సంగతులు. ఒక అమ్మాయిని విషకన్యగా మార్చే ప్రక్రియలో ఆమెకు చాలా విషం ఇచ్చేవారు. దీంతో ఆమె స్పర్శ కూడా ఒకరిని చంపేది. ఆమెని ముద్దుపెట్టుకున్నా, శారీరక సంబంధం కలిగి ఉన్నా వెంటనే మరణించేవారు. పూర్వ కాలంలో రాజులు విషకన్యలను తమ శత్రు రాజులను చంపడానికి, రహస్య సమాచారం తెలుసుకోవడానికి నియమించేవారు.

Indian and Pakistan: అంతా ఖుష్.. సరిహద్దుల్లో మారిన సీన్.. సందడిగా మిఠాయిల పంపిణీ..

Zodiac Signs : ఈ 5 రాశులవారు ఆలస్యంగా వివాహం చేసుకుంటారు..! అందులో మీరున్నారా తెలుసుకోండి..

Maruti Suzuki: గ్రామీణ ప్రాంతాల్లో మారుతీ కారు జోరు.. 50 లక్షల మార్కును దాటిన అమ్మకాలు!

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?