Maruti Suzuki: గ్రామీణ ప్రాంతాల్లోనూ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న మారుతీ కార్లు.. రికార్డు స్థాయిలో విక్రయాలు..

Maruti Suzuki: మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (ఎంఎస్ఐఎల్) భారత గ్రామీణ మార్కెట్లలో మొత్తం 50 లక్షల యూనిట్ల అమ్మకాల మార్కును తాకింది.

Maruti Suzuki: గ్రామీణ ప్రాంతాల్లోనూ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న మారుతీ కార్లు.. రికార్డు స్థాయిలో విక్రయాలు..
Maruti Suzuki
Follow us
KVD Varma

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 22, 2021 | 12:24 PM

Maruti Suzuki: మారుతి సుజుకి కార్లు గ్రామీణ ప్రాంతాల్లోనూ హాట్ కేకుల్లా అమ్ముడుపోతోంది.  మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (ఎంఎస్ఐఎల్) భారత గ్రామీణ మార్కెట్లలో మొత్తం 50 లక్షల యూనిట్ల అమ్మకాల మార్కును తాకింది. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 1,700 కి పైగా అవుట్‌లెట్లతో, ఈ రోజు మొత్తం అమ్మకాల్లో దాదాపు 40 శాతం గ్రామీణ మార్కెట్ల నుండే వస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-జూన్ కాలంలో కంపెనీ మొత్తం అమ్మకాలు 3,53,614 యూనిట్లు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం అమ్మకాలు 14,57,861 యూనిట్లు, ఇది 2019-20లో మొత్తం 15,63,297 యూనిట్ల అమ్మకాల కంటే తక్కువగా ఉంది.

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ & సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, “మా కస్టమర్లు స్థానిక డీలర్ భాగస్వాముల సహకారంతో, గ్రామీణ ప్రాంతాల మొత్తం అమ్మకాల పరంగా మేము 5 మిలియన్ మార్కును దాటినట్లు ప్రకటించడం గర్వంగా ఉంది.  సంస్థ వ్యాపారంలో గ్రామీణ మార్కెట్లకు ప్రత్యేక స్థానం ఉంది. గ్రామీణ భారతదేశంలోని వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులు, సేవలను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము.” అని చెప్పారు.

జూన్లో 217% నెలవారీ వృద్ధి

మారుతి కార్ల డిమాండ్ జూన్ లో ఎగసింది. నెలవారీ ప్రాతిపదికన 217% వృద్ధితో కంపెనీ 1,47,368 యూనిట్లను విక్రయించింది. మేలో కంపెనీ 46,555 యూనిట్లను మాత్రమే విక్రయించింది. జూన్లో, మారుతి కాంపాక్ట్ వెహికల్, యుటిలిటీ వెహికల్ విభాగం వృద్ధిని సాధించింది.

జూన్‌లో కంపెనీ 17,237 యూనిట్లను విక్రయించగా, మేలో 11,262 యూనిట్లు విక్రయించింది. అదేవిధంగా, ఇది మినీ, కాంపాక్ట్ వెహికల్ విభాగంలో 97,359 యూనిట్లను విక్రయించింది. మొత్తం నాలుగు రెట్లు వృద్ధిని నమోదు చేసింది. యుటిలిటీ వెహికల్ విభాగంలో, మేలో 6,355 యూనిట్లతో పోలిస్తే 25,484 యూనిట్లను విక్రయించింది.

కార్ వారంటీ, ఉచిత సేవలను జూలై 31 వరకు పొడిగించారు

మారుతి తన వినియోగదారులకు వారంటీ వ్యవధిని జూలై 31 వరకు పొడిగించింది . మార్చి 15, 2021 నుండి 2021 జూన్ 30 మధ్య ఉన్న వినియోగదారులకు ఉచిత సేవ, వారంటీ పొడిగింపు  ప్రయోజనం లభిస్తుందని కంపెనీ తెలిపింది.

మారుతి సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సర్వీసెస్) పార్థో బెనర్జీ మాట్లాడుతూ, మా వినియోగదారులకు సౌలభ్యం ఇవ్వడానికి మేము వారంటీ వ్యవధిని పొడిగిస్తున్నాము. మహమ్మారి కాలంలో, వినియోగదారులు వాహనాల ద్వారా ప్రయాణించలేరు. అటువంటి పరిస్థితిలో, ఇప్పుడు వీరు వారి  సౌలభ్యం మేరకు మా సేవలను సద్వినియోగం చేసుకోగలుగుతారని చెప్పారు.

Also Read: Infosys Story: రెండు కోట్ల ఆఫర్ తిరస్కరించిన ఇన్ఫోసిస్ ఇప్పుడు 6.60 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న సంస్థ..ఆసక్తికర ప్రస్ధానం!

Personal Loan: అప్పులు పెరిగిపోతే ఈ పద్ధతిని అనుసరించండి.. మొత్తం రుణం తక్కువ EMIలో చెల్లించండి..