RBI New Rules : బ్యాంకు ఖాతాదారులకు గమనిక..! డెబిట్, క్రెడిట్ కార్డులపై పెరగనున్న ఛార్జీలు.. ఆర్బీఐ కొత్త నిబంధనలు తెలుసుకోండి
RBI New Rules : ఏటిఎం లావాదేవీలపై బ్యాంకులు వసూలు చేసే ఇంటర్‌చేంజ్ ఫీజును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఇటీవల పెంచింది. ఆర్థిక లావాదేవీలపై ఇంటర్‌ఛేంజ్
RBI New Rules : ఏటిఎం లావాదేవీలపై బ్యాంకులు వసూలు చేసే ఇంటర్‌చేంజ్ ఫీజును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఇటీవల పెంచింది. ఆర్థిక లావాదేవీలపై ఇంటర్‌ఛేంజ్ ఫీజును రూ.15 నుంచి రూ .17 కు పెంచారు. ఈ పెరుగుదల ఆర్థికేతర లావాదేవీలపై కూడా పడింది. దీనిని రూ.5 నుంచి రూ.6 కు పెంచారు. ఈ కొత్త రేటు ఆగస్టు 1, 2021 నుంచి అమల్లోకి వస్తుంది. ఆర్‌బిఐ ప్రకారం.. ఇంటర్‌చేంజ్ ఫీజు అంటే వ్యాపారి నుంచి బ్యాంక్ వసూలు చేసేది. ఈ వ్యాపారులు క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా డబ్బులు తీసుకున్నప్పుడు బ్యాంకు ఈ ఛార్జీలు వసూలు చేస్తుంది.
ఏ కస్టమర్ అయినా నెలకు ఏటీఎం నుంచి 5 ఉచిత లావాదేవీల సదుపాయాన్ని పొందవచ్చని ఆర్బీఐ ప్రకటించింది. ఇందులో ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలు ఉండవచ్చు. ఇది మీ బ్యాంక్ ఏటిఎం నుంచి మాత్రమే పొందాలి. మీరు ఇతర బ్యాంకుల ఏటిఎంల నుంచి కూడా నగదును ఉపసంహరించుకోవచ్చు, కానీ దాని పరిమితి నెలకు 3 వరకు మాత్రమే ఉంటుంది. మీరు దీనికి మించి లావాదేవీలు చేస్తే ఒక విత్ డ్రాకు రూ.20 వసూలు చేస్తారు. దీన్ని ప్రస్తుతం పెంచనున్నట్లు ప్రకటించారు. నగదు లావాదేవీల కోసం కొత్త నిబంధనలకు సంబంధించి ఐసిఐసిఐ బ్యాంక్ తన వినియోగదారులకు నోటీసు జారీ చేసింది. ఇందులో ఏటిఎం ఇంటర్‌ఛార్జ్, చెక్ బుక్ ఛార్జీల గురించి కూడా సమాచారం ఇచ్చారు. ఈ సవరించిన ఛార్జీలు పొదుపు ఖాతాదారులతో పాటు సాలరీ ఖాతాదారులకు కూడా వర్తిస్తుంది. ఈ కొత్త నిబంధన ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుంది.
ఎస్బిఐ జూలై నెలలో ఏటిఎంలు, బ్యాంక్ శాఖల నుంచి డబ్బును ఉపసంహరించుకునే సేవా ఛార్జీని సవరించింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నుంచి నెలలో 4 కంటే ఎక్కువ లావాదేవీలు చేస్తే అధిక చార్జీలు వసూలు చేస్తారు. అంతేకాదు ఎస్‌బిఐ కస్టమర్లకు 10 పేజీల చెక్‌బుక్‌లు మాత్రమే ఉచితంగా లభిస్తాయి. మీరు అంతకంటే ఎక్కువ తీసుకోవాలంటే బ్యాంకు రుసుము వసూలు చేస్తుంది. జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా ఈ నిబంధన అమలు చేస్తున్నారు.