Complete Lockdown: ఈనెల 24,25 తేదీల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌.. కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర సర్కార్

ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈనెల 24,25 తేదీల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించారు. ఇప్పటివరకు కరోనా కేసులు నియంత్రణలోకి రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

Complete Lockdown: ఈనెల 24,25 తేదీల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌.. కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర సర్కార్
Lockdown
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 21, 2021 | 7:28 PM

కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈనెల 24,25 తేదీల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించారు. కేరళలో ఇప్పటివరకు కరోనా నియంత్రణలోకి రాలేదు. దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. దీంతో టెస్టింగ్‌ పెంచాలని నిర్ణయం తీసుకుంది కేరళ ప్రభుత్వం. రోజుకు 3 లక్షల టెస్ట్‌లు చేయబోతున్నారు.

జిల్లాలో మైక్రో కంటైన్మెంట్‌ జోన్లను ఏర్పాట్లను చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. గత నెల 12, 13 తేదీల్లో కూడా కేరళలో కఠిన ఆంక్షలు విధించారు. బక్రీద్‌ సందర్భంగా ఆంక్షలను ఎత్తివేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం చేయడంతో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కూడా రాష్ట్రంలో కఠిన ఆంక్షలు విధించాలని కేరళ ప్రభుత్వాన్ని కోరింది. అటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు అన్‌లాక్ కాగా.. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ కొనసాగుతోంది. థర్డ్ వేవ్ టెన్షన్ మొదలు కావడంతో కరోనా నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచిస్తోంది.

ఇదిలావుంటే.. దేశంలో కరోనా మరణాల సంఖ్య 10 రెట్లు పెరగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. నిన్న 374 మరణాలు సంభవించగా.. ఇవాళ ఏకంగా 3998 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇందులో ఒక్క మహారాష్ట్రలోని 3,509 మంది వైరస్‌తో మరణించగా.. మిగిలిన దేశమంతా 489 మరణాలు సంభవించాయి. ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా 42,015 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 3,12,16,337కి చేరింది. ఇందులో 4,07,170 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి: TTD: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. అర్చకుల శాశ్వత నియామకంపై ఏక సభ్య కమిటీ

Valuable Wood: ఎర్రచందనంను మించిన ధర.. ప్రంపచంలోనే అత్యంత ఖరీదైన కలప ఇదే..

ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు