Indian and Pakistan: అంతా ఖుష్.. సరిహద్దుల్లో మారిన సీన్.. సందడిగా మిఠాయిల పంపిణీ..
స్వీట్లు పంచుకున్నారు.. కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు.. పగలు, ప్రతికారాలు దూరం పెట్టారు. రెండు దేశాల సరిహద్దుల్లో చాలా కాలం తర్వాత కనిపించిన సీన్ ఇది. ఎందుకో ఇప్పుడు ఇదంతా అనుకుంటున్నారా..
స్వీట్లు పంచుకున్నారు.. కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు.. పగలు, ప్రతికారాలు దూరం పెట్టారు. రెండు దేశాల సరిహద్దుల్లో చాలా కాలం తర్వాత కనిపించిన సీన్ ఇది. ఎందుకో ఇప్పుడు ఇదంతా అనుకుంటున్నారా.. ఈ రోజు పండగ సందర్భంగా రెండు దేశాలకు చెందిన సైనికులు మిఠాయిలను ఇచ్చి పుచ్చుకున్నారు. రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దుల్లో ఈద్ పండుగ ఇలా జరుకున్నారు. ప్రత్యేక రోజుల్లో ఇరు దేశాల భద్రతా సిబ్బంది కలిసిపోతారు. ప్రత్యేక దినాల్లో ఇరు సైనికులు స్నేహాభావంతో మిఠాయిలు ఇచ్చిపుచ్చుకుంటారు. తాజాగా బక్రీద్ పర్వదినం సందర్భంగా దేశ సరిహద్దుల్లో ఉన్న సైనికులు కూడా పండుగ చేసుకున్నారు.
ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పూంచ్- రావల్‌కోట్ సరిహద్దు వద్ద ఉన్న భారత్ పాక్ సైనికులు స్వీట్లు పంచుకున్నారు.
ఇటు పశ్చిమ బెంగాల్‌లోని బంగ్లాదేశ్ సరిహద్దులో కూడా ఇరు దేశాలు సైనికులు మిఠాయి దౌత్యం నిర్వహించారు. ఇక పంజాబ్‌లోని వాఘా సరిహద్దులో కూడా ఈ కార్యక్రమం మరింత సందడిగా జరిగింది.
పండుగ సందర్భంగా మిఠాయిలు ఇచ్చిపుచ్చుకుని మిఠాయి దౌత్యం నిర్వహించామని పూంచ్‌లోని భారత లెఫ్టినెంట్ కమాండర్ దేవేందర్ ఆనంద్ తెలిపారు. జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద మిఠాయిలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని బీఎస్‌ఎఫ్ జవాన్లు, పాక్ రెసిడెంట్లు మార్చుకున్నట్లు వివరించారు.
ఇరు దేశాల సైనికులు మిఠాయిలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇలాంటి వాటితో రెండు దేశాల మధ్య స్నేహం, విశ్వాసాన్ని పెంచుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇలాంటి మిఠాయి దౌత్యం నిర్వహించారు.
Jammu & Kashmir: Indian & Pakistan armies exchanged sweets at Kaman Aman Setu in Uri, Tithwal Crossing in Tangdhar, Kupwara, Poonch-Rawalakot Crossing Point & Mendhar-Hotspring Crossing Point in Poonch on the occasion of #EidAlAdha pic.twitter.com/OpobhaMvjQ
— ANI (@ANI) July 21, 2021