UP Professor: ఫేస్‌బుక్‌లో అభ్యంతకర వ్యాఖ్యలు..నిందితుడి వ్యవహార శైలిపై ఆగ్రహం.. జ్యుడిషియల్ కస్టడీకి ప్రొఫెసర్..
కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీపై సోషల్ మీడియాలో అవమానకర పోస్టు పెట్టిన ప్రొఫెసర్ షహర్యార్ అలీ జైలు పాలయ్యాడు. ఇప్పటికే ఉద్యోగం పోగొట్టుకున్న ఈ ప్రొఫెసర్‌కు బెయిల్ ఇచ్చేందుకు అలహాబాద్ కోర్టు నిరాకరించింది..
బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉండి సోషల్ మీడియాలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీపై అభ్యంతరమైన పోస్టు పెట్టినందుకు ఆ ప్రొఫెసర్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పలేదు. ఉత్తరప్రదేశ్ చెందిన SRK కళాశాలలో చరిత్ర విభాగం అధిపతి షహర్యార్ అలీ ఈ ఏడాది మార్చిలో ఫేస్‌బుక్‌లో స్మృతీ ఇరానీని ఉద్దేశించిన అభ్యంతకర, అవమానకర వ్యాఖ్యలు చేశాడు. ఈ కామెంట్స్ వైరల్‌గా మారి వివాదాస్పదం కావడంతో తొలగించారు. ఈలోగా బీజేపీ నాయకులు షహర్యార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు..
కేంద్ర మంత్రి పరువుకు నష్టం కలిగించినందుకు ఆయనపై మీద కేసు నమోదైంది. షహర్యార్ అలీ వ్యాఖ్యల వివాదం నేపథ్యంతో ఆయన పని చేస్తున్న కళాశాల యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది. షహర్యార్‌ను అరెస్టు చేసేందుకు వారెంట్ కూడా జారీ చాలా రోజులు పరారీలో ఉన్నాడు. తాజాగా బెయిల్ కోసం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు.
ఈ కేసు విచారణ సందర్భంగా షహర్యార్ వ్యవహార శైలిని న్యాయస్థానం తప్పు పట్టింది. మహిళలపై గౌరవం లేకుండా ఆయన ఉపయోగించిన భాషపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విమర్శించడానికి, జోకులకు ఒక హద్దు ఉంటుందని ఈ కారణం చూపి అరెస్టు నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేసింది. తన ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయిందని షహర్యార్ అలీ విన్నవించుకొని, క్షమాపణ చెప్పినా న్యాయమూర్తి అంగీకరించలేదు.
షహర్యార్ బెయిల్ పిటీషన్‌ను రద్దు చేస్తూ జ్యుడిషియల్ కస్టడీకి ఆదేశించారు. పోలీసులు ఆయన్ని జైలుకు తరలించారు. ప్రొఫెసర్ షహర్యాల్ అలీ వ్యాఖ్యలు ఆయన మానసిక స్థితిని తెలియజేస్తున్నాయని. ఇలాంటి వ్యక్తులు విద్యార్థులకు చరిత్ర పాఠాలు ఎలా బోధించగలరని స్థానిక బీజేపీ నాయకులు ప్రశ్నించారు.