Murder Attempt : తూర్పుగోదావరి జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ, కత్తులతో దాడులు, ముగ్గురిపై హత్యాయత్నం

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని తూర్పు గొనగూడెం గ్రామంలో ఆస్తి తగాదా కత్తుల సమరానికి దారితీసింది. స్థలం వివాదం విషయంలో..

Murder Attempt : తూర్పుగోదావరి జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ, కత్తులతో దాడులు, ముగ్గురిపై హత్యాయత్నం
Two Groups Attack
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 21, 2021 | 9:28 PM

Murder attempt – East Godavari : తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని తూర్పు గొనగూడెం గ్రామంలో ఆస్తి తగాదా కత్తుల సమరానికి దారితీసింది. స్థలం వివాదం విషయంలో ఒక వర్గానికి చెందిన వాళ్లు, మరో వర్గానికి చెందిన వ్యక్తులు కత్తులతో దాడులకు పాల్పడ్డారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్న ముగ్గురు వ్యక్తులపై హత్యాయత్నం చేశారు.

దీంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వారిని హుటాహుటీన గ్రామస్తులు108 అంబులెన్స్ లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సెంటర్లో పట్టపగలు పబ్లిక్‌ చూస్తుండగా స్వైరవిహారం, కత్తిపోట్లు. అయితే, జనగామ జనం ఏం చేశారంటే..!

పగ, ప్రతీకారం.. తన అక్కను చంపేశాడనే కసి.. అతన్ని కత్తి దూసేలా చేశాయి. నడిరోడ్డుపై జనంతా తిరుగుతున్న సమయంలోనే.. బావను కింద పడేసి కత్తితో పోట్లు పొడిచాడు బావమరిది. జనగాం జిల్లా కేంద్రంలో జరిగిందీ ఘటన. ఇది ఇవాళ్టి పగ కాదు. ఐదేళ్లుగా అనుచుకున్న ప్రతీకారేచ్ఛ. అదను కోసం ఎదురుచూసి, చూసి.. పబ్లిక్‌లోనే మర్డర్‌ అటెంప్ట్‌ చేశాడు ఆ యువకుడు.

కళ్ల ముందు ఘోరం జరుగుతుంటే.. చాలాచోట్ల జనం సినిమా చూసినట్టు చూస్తుంటారు. సెల్‌ఫోన్లలో బంధిస్తుంటారు. కానీ జనగామ జనం అలాకాదు. ముందుకు ఉరికారు. కత్తితో ఎటాక్ చేస్తున్న యువకుడిని పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించారు. బాధితుడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

రక్తంమడుగులో ఉన్న బాధితున్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి బాధితుడు నర్మెట మండలం ఇప్పులగడ్డ తండాకు చెందిన బానోతు చంద్రశేఖర్ గా గుర్తించారు. హత్యకు యత్నించిన యువకుడు కాజీపేటకు చెందిన ధరావత్ రమేష్ గా పోలీసులు తెలిపారు. ఐదు సంవత్సరాల క్రితం తన అక్క సరితను హత్య చేసి జైలుకు వెళ్ళి వచ్చిన బావ బానోతు చంద్రశేఖర్.. పథకం ప్రకారం బావ హత్యకు స్కెచ్ వేసి కత్తితో హత్యా యత్నం చేశాడు రమేశ్ అని వెల్లడించారు.