Lover Suicide: కరోనాతో ప్రియురాలి మృతి.. ప్రేమించిన వ్యక్తి లేని లోకంలో ఉండలేనని ప్రియుడి బలవన్మరణం..

Lover Suicide: కరోనా మహమ్మారి యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడించిన విషయం తెలిసిందే. ఫస్ట్‌ వేవ్‌ సెకండ్‌ వేవ్‌ రూపంలో ఎంతో మందిని బలి తీసుకుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుప్పకూలేలా చేసిన ఈ మాయదారి రోగం మనుషుల మధ్య...

Lover Suicide: కరోనాతో ప్రియురాలి మృతి.. ప్రేమించిన వ్యక్తి లేని లోకంలో ఉండలేనని ప్రియుడి బలవన్మరణం..
Boyfriend Suicide
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 22, 2021 | 5:45 AM

Lover Suicide: కరోనా మహమ్మారి యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడించిన విషయం తెలిసిందే. ఫస్ట్‌ వేవ్‌ సెకండ్‌ వేవ్‌ రూపంలో ఎంతో మందిని బలి తీసుకుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుప్పకూలేలా చేసిన ఈ మాయదారి రోగం మనుషుల మధ్య ఉన్న ఆత్మీయతను కూడా దెబ్బ తీసింది. కరోనా కారణంగా మరణించిన వారు కొందరైతే తమకు నచ్చిన వారిని కోల్పోయి నరకం అనుభవిస్తున్న వారు మరికొందరు. తాజాగా విశాఖలో జరిగిన ఓ సంఘటన కంటతడి పెట్టిస్తోంది.

వివరాల్లోకి వెళితే.. విశాఖలో ఓ ప్రైవేటు హోటల్‌లో పనిచేస్తున్న రోహిత్‌ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా గుంటూరుకు చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఒకరిని ఒకరు ఎంతో ఆప్యాయంగా ప్రేమించుకుంటున్న వీరి జీవితంలోకి కరోనా ఓ శత్రువులా వచ్చింది. రోహిత్‌ ప్రియురాలికి ఇటీవల కరోనా సోకింది. తాజాగా ఆరోగ్యం విషమించడంతో రెండు రోజుల క్రితం ఆమె కన్ను మూసింది. దీంతో ప్రియురాలి మరణాన్ని జీర్చించుకోలేని రోహిత్‌ షాకింగ్‌ నిర్ణయాన్ని తీసుకున్నాడు. తాను ప్రేమించిన వ్యక్తి లేని ఈ లోకం నేను ఉండను అన్నట్లు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంటూరులో కరోనాతో ప్రియురాలు మృతి చెందిందన్న వార్తను తట్టుకోలేని రోహిత్‌.. బుధవారం విశాఖలోని గాజువాక కణితి రోడ్డులోని తాను అద్దెకు ఉంటున్న బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతోన్న ఈ మాయదారి రోగం ప్రపంచాన్ని శాశ్వతంగా ఇంకెప్పుడు వదిలి వెళుతుందో.

Also Read: Murder Attempt : తూర్పుగోదావరి జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ, కత్తులతో దాడులు, ముగ్గురిపై హత్యాయత్నం

Janagama : సెంటర్లో పట్టపగలు పబ్లిక్‌ చూస్తుండగా స్వైరవిహారం, కత్తిపోట్లు. అయితే, జనగామ జనం ఏం చేశారంటే..!

Cyber Crime: 77 ఏళ్ల వృద్ధుడికి డేటింగ్ పేరుతో వల.. చిక్కిన తర్వాత సినిమా చూపించారు..