Janagama : సెంటర్లో పట్టపగలు పబ్లిక్‌ చూస్తుండగా స్వైరవిహారం, కత్తిపోట్లు. అయితే, జనగామ జనం ఏం చేశారంటే..!

పగ, ప్రతీకారం.. తన అక్కను చంపేశాడనే కసి.. అతన్ని కత్తి దూసేలా చేశాయి. నడిరోడ్డుపై జనంతా తిరుగుతున్న సమయంలోనే.. బావను కింద పడేసి కత్తితో..

Janagama : సెంటర్లో పట్టపగలు పబ్లిక్‌ చూస్తుండగా స్వైరవిహారం, కత్తిపోట్లు. అయితే, జనగామ జనం ఏం చేశారంటే..!
Janagama Murder Attempt

Janagama Murder Attempt : పగ, ప్రతీకారం.. తన అక్కను చంపేశాడనే కసి.. అతన్ని కత్తి దూసేలా చేశాయి. నడిరోడ్డుపై జనంతా తిరుగుతున్న సమయంలోనే.. బావను కింద పడేసి కత్తితో పోట్లు పొడిచాడు బావమరిది. జనగాం జిల్లా కేంద్రంలో జరిగిందీ ఘటన. ఇది ఇవాళ్టి పగ కాదు. ఐదేళ్లుగా అనుచుకున్న ప్రతీకారేచ్ఛ. అదను కోసం ఎదురుచూసి, చూసి.. పబ్లిక్‌లోనే మర్డర్‌ అటెంప్ట్‌ చేశాడు ఆ యువకుడు.

కళ్ల ముందు ఘోరం జరుగుతుంటే.. చాలాచోట్ల జనం సినిమా చూసినట్టు చూస్తుంటారు. సెల్‌ఫోన్లలో బంధిస్తుంటారు. కానీ జనగామ జనం అలాకాదు. ముందుకు ఉరికారు. కత్తితో ఎటాక్ చేస్తున్న యువకుడిని పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించారు. బాధితుడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

రక్తంమడుగులో ఉన్న బాధితున్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి బాధితుడు నర్మెట మండలం ఇప్పులగడ్డ తండాకు చెందిన బానోతు చంద్రశేఖర్ గా గుర్తించారు. హత్యకు యత్నించిన యువకుడు కాజీపేటకు చెందిన ధరావత్ రమేష్ గా పోలీసులు తెలిపారు. ఐదు సంవత్సరాల క్రితం తన అక్క సరితను హత్య చేసి జైలుకు వెళ్ళి వచ్చిన బావ బానోతు చంద్రశేఖర్.. పథకం ప్రకారం బావ హత్యకు స్కెచ్ వేసి కత్తితో హత్యా యత్నం చేశాడు రమేశ్ అని వెల్లడించారు.

Read also: Padi Koushik Reddy : టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న పాడి కౌశిక్ రెడ్డి.. ఆహ్వానించిన సందర్భంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు