Padi Koushik Reddy : టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న పాడి కౌశిక్ రెడ్డి.. ఆహ్వానించిన సందర్భంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ కార్యద‌ర్శి పైడి కౌశిక్ రెడ్డి కొంచెం సేపటి క్రితం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత..

Padi Koushik Reddy :  టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న పాడి కౌశిక్ రెడ్డి.. ఆహ్వానించిన సందర్భంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
Cm Kcr Padi Koushik Reddy
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 21, 2021 | 6:05 PM

CM KCR – Padi Koushik Reddy : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ కార్యద‌ర్శి పైడి కౌశిక్ రెడ్డి కొంచెం సేపటి క్రితం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత‌, సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్‌ తీర్థం తీసుకున్నారు. హైదరాబాద్ తెలంగాణ భ‌వ‌న్‌లో జ‌రిగిన కార్యక్రమంలో కౌశిక్‌రెడ్డికి సీఎం కేసీఆర్ గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. కౌశిక్‌రెడ్డి వెంట వ‌చ్చిన అనుచ‌రుల‌ను సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

“తెలంగాణ సాధన కోసం చాలా మంది పనిచేసారు.. 1969 ఉద్యమంలో 400 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. చెన్నారెడ్డి ఎలాంటి కమ్యూనికేషన్ లేకపోయినా ఉద్యమాన్ని నడిపారు. కానీ అప్పటి పాలకులు తెలంగాణ ఏర్పాటు చేయలేకపోయారు. రాజకీయాలు జరుగుతుంటాయి.. గెలుపు ఓటములు నిరంతర ప్రక్రియ. తెలంగాణ రాష్ట్రం చాలా కష్టపడి సాధించిన రాష్ట్రం. ఇది రాచరిక వ్యవస్థ కాదు..ఎప్పుడు ఒకరే అధికారంలో ఉండరు. కానీ మన కంట్రిబ్యూషన్ ఉంటది.” అని కేసీఆర్ ఈ సందర్భంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

Padi Koushik Reddy

Padi Koushik Reddy

“గొర్రెల పంపిణీ స్కిం ఉత్త స్కిం కాదు.. ప్రతి పథకం వెనుక లోతైన విశ్లేషణ ఉంది. గొర్రెల ఉత్పత్తి లో దేశంలోనే తెలంగాణ టాప్. పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి ప్రకటన చేశారు. నా తెలంగాణ రైతులు నేడు 3 కోట్ల టన్నుల వడ్లు పండించారు. మాకు కులం మతం జాతి లేదు.. పేదరిక నిర్ములన దిశగా పోతున్నాం. రైతు బంధు వల్ల రైతు ఇప్పుడు ధీమాతో ఉన్నాడు. తెలంగాణ ఇక ఎవడు ఎం పికినా ఇక కంరెంట్ పోదు. ధరణి తీసుకురమ్మని ఎవరన్నా ఆడిగారా..? ప్రతి మనిషి చిరునవ్వు తో బ్రతకాలి. ఆంధ్ర వాళ్ళు కాదు హైదరాబాది అని చెప్పుకోవాలి. ఒకప్పుడు తెలంగాణ వాళ్ళను ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వెక్కిరించారు.” అని కేసీఆర్ అన్నారు.

“దేవుడు నోరు ఇచ్చాడని కుక్కలు మోరిగినట్టు మొరుగుతారా..? ఎన్నికలతో సంబంధం లేకుండా మేము అభివృద్ధి చేస్తూ మేము వెళ్తున్నాం.. అన్ని ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని గెలిపిస్తున్నారు. దేశంలో దళితులు అణచివేతకు గురయ్యారు. దళితుల అభివృద్ధి కోసం తెచ్చిన పథకం చూసి కొంత మంది బ్లెడ్ ప్రెషర్ పెరుగుతుంది.” అంటూ కేసీఆర్ హుజురాబాద్ ఉపఎన్నికల సందర్భంగా విపక్షాలు చేస్తోన్న విమర్శలను తిప్పికొట్టారు.

Read also : SI Madhu : ఎస్సై మధు మోసం చేశాడని ఆత్మహత్యాయత్నం చేసిన యువతి