AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ananya Kumari: కేరళ ఎన్నికల్లో పోటీ చేయబోయిన తొలి ట్రాన్స్ జెండర్ అనన్య కుమారి అనుమానాస్పద మృతి.. వేధింపులే కారణమా..???

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేసి..... తమ వర్గం నుంచి తొలి ట్రాన్స్ జెండర్ వ్యక్తిగా పాపులర్ అయిన అనన్య కుమారి అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించింది.

Ananya Kumari: కేరళ ఎన్నికల్లో పోటీ చేయబోయిన తొలి ట్రాన్స్ జెండర్ అనన్య కుమారి అనుమానాస్పద మృతి.. వేధింపులే కారణమా..???
Transgender Ananya Kumari
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jul 21, 2021 | 4:34 PM

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేసి….. తమ వర్గం నుంచి తొలి ట్రాన్స్ జెండర్ వ్యక్తిగా పాపులర్ అయిన అనన్య కుమారి అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించింది. కొచ్చి లోని తన ఫ్లాట్ లోని గదిలో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. అయితే ఆమె ఫ్రెండ్స్ మాత్రం, ఎవరో ఆమెను ఇందుకు ప్రోత్సహించి ఉంటారని, దర్యాప్తు జరిపించాలని కోరుతూ సీఎం పినరయి విజయన్ కి సమర్పించిన వినతిపత్రంలో కోరారు.గత ఏడాది సర్జరీ ద్వారా మార్పించుకున్నప్పటి నుంచి అనన్య కుమారి పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నట్టు తెలిసింది. సర్జరీలో చాలా లోపాలు జరిగాయని, బహుశా ఏడాదికి మించి తాను బతకలేకపోవచ్చునని లోగడ ఆమె చెబుతూ వచ్చేదని తెలియవవచ్చింది. అనన్య కుమారి అలెక్స్ గా వ్యవహరించే ఈమె రేడియో జాకీగా, యాంకర్ గా, మేకప్ ఆర్టిస్టుగా కూడా పని చేసింది. కేరళ మలప్పురం జిల్లా వెంగర నియోజకవర్గం నుంచి నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈమెను నామినేట్ చేశారు. అయితే యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి కున్హల కుట్టికి వ్యతిరేకంగా మాట్లాడాలని, ఎల్ డీ ఎఫ్ ప్రభుత్వాన్నివిమర్శించాలని తనకు టికెట్ ఇచ్చిన డెమొక్రటిక్ సోషల్ జస్టిస్ పార్టీ నేతలు తనపై ఒత్తిడి తెచ్చేవారని.. ముఖం కనబడకుండా పర్దా వేసుకుని ప్రచారం చేయాలని వేధించేవారని అనన్య కుమారి వాపోయేదని కూడా సమాచారం. బహుశా ఈ కారణం వల్లే ఆమె తన నామినేషన్ ని ఉపసంహరించుకుంది.

28 ఏళ్ళ అనన్య కుమారి మృతికి ఈమె వర్గం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. డెమొక్రటిక్ సోషల్ జస్టిస్ నేతల టార్చర్ భరించలేకనే ఈమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని కూడా ఈవర్గం అనుమానం వ్యక్తం చేస్తోంది.

మరిన్ని ఇక్కడ చూడండి: Andhrapradesh: ఏపీలోని ఆ ప్రాంత ప్రజలకు అలెర్ట్.. వారం రోజులపాటు కర్ఫ్యూ విధింపు

RRR Movie: “ఆర్ఆర్ఆర్” మూవీ కోసం జక్కన్న నయా ప్లాన్.. రంగంలోకి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్..

ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు వాసికి పవన్ ఆర్థిక సాయం
ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు వాసికి పవన్ ఆర్థిక సాయం
శని దోష విముక్తికి సదవకాశం.. పరిహారాలు తెలుసుకోండి..!
శని దోష విముక్తికి సదవకాశం.. పరిహారాలు తెలుసుకోండి..!
పాకిస్తాన్‌కే వెళ్లిపోండి.. కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ ఫైర్..
పాకిస్తాన్‌కే వెళ్లిపోండి.. కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ ఫైర్..
లైవ్ మ్యాచ్‌లో ప్రమాదం.. స్పిన్ బౌలింగే కదా హెల్మెట్ తీస్తే..
లైవ్ మ్యాచ్‌లో ప్రమాదం.. స్పిన్ బౌలింగే కదా హెల్మెట్ తీస్తే..
అమ్మానాన్నలు తీర్చిదిద్దిన వైభవ్ కెరీర్.. జర్నీ అంతా కన్నీళ్లే
అమ్మానాన్నలు తీర్చిదిద్దిన వైభవ్ కెరీర్.. జర్నీ అంతా కన్నీళ్లే
లివ‌ర్ ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని అస్సలు తీసుకోకూడదు
లివ‌ర్ ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని అస్సలు తీసుకోకూడదు
చిన్నదే కానీ గట్టిది.. వాగన్ఆర్‌ రికార్డ్‌ను బద్దలు కొట్టింది!
చిన్నదే కానీ గట్టిది.. వాగన్ఆర్‌ రికార్డ్‌ను బద్దలు కొట్టింది!
షుగర్ ఉన్నవారు మామిడి పండు తినొచ్చా లేదా..?
షుగర్ ఉన్నవారు మామిడి పండు తినొచ్చా లేదా..?
ఈ ఫుడ్స్‌ తింటే షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి..!
ఈ ఫుడ్స్‌ తింటే షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి..!
మన బుర్రను పాడు చేసే పనులు ఇవే.. జాగ్రత్త పడకపోతే అంతే సంగతి
మన బుర్రను పాడు చేసే పనులు ఇవే.. జాగ్రత్త పడకపోతే అంతే సంగతి